[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అసలైన అందం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అంతరాత్మ ఓ అద్దం
అక్కడ చూడు నీ ప్రతిబింబం
అదే అసలైన నీ అందం
ఆ అందం లేనినాడు
వ్యర్థం నీ జీవితం
ఆత్నను చంపుకోవడం
అంటే నిన్ను నీవే తుంచుకోవడం
అంతరాత్మ లేని నాడు
బతికున్న మరణించినట్లే
అంతరాత్మ కంటే నీకు
గొప్ప స్నేహితుడు లేడు
ఆ స్నేహాన్ని వదులుకోకు
ఆత్మ సంభాషణతోనే
మంచి మనిషిగా మారాలి నీవు
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.