కొండగాలిని, గోదారి వరదని, అంత్య ప్రాసల అనునయాన్ని కలబోసి, జగతిని మధుర కవితతో అలరించిన తెలుగు సాహితీ శిఖరం: ఆరుద్ర శత జయంతి [1925-2025] పురస్కరించుకొని సంచిక సంపాదక వర్గం, సెప్టెంబర్ 2025 న ఒక ప్రత్యేక సంపుటి ప్రచురించే ప్రయత్నం చేస్తుంది.
ఒక సాహితీకారుడుగా, సాహితీ వేత్తగా బహు కొద్ది మంది మాత్రమే రాణించ గలుగుతారు. అందులో ఆరుద్రది తెలుగు సాహిత్యం లో ఒక ప్రత్యేక స్థానం,
అది నిర్వివాదాంశం.
తెలుగు సినిమా పాటకు వస్తే, ఆదుర్తి, ఆత్రేయ కలియిక లాగే, బావు+ముళ్ళమూడి ఆరుద్ర (ముగ్గురయిన, ఇద్దరే అనాలి!)
ఒక అసామాన్య కలయిక.
ఆత్రేయ+జగపతి, ఆరుద్ర+అనుపమ ఒక అరుదైన అమరిక.
ఆరుద్రపై ఒక ప్రత్యేక వ్యాసం, గణాంక విశ్లేషణ (ఆత్రేయపై వెలువరించిన సందాన), అందించనున్నాము.
ఆయన రచనలపై మంచి విశ్లేషణ, ఆయనతో మీకున్న అనుభవాలు క్లుప్తంగా అందిస్తే 3 3-4 పేజీలలో) అందిస్తే, ఆ సంపుటి లో పొందుపరుస్తాము.
గడువు: 10-ఆగష్టు-2025
“ఎవరికి వారే ఈ లోకమైనా –
నెనరు, కూరిమి కూడితే – జీవితమంతా చిత్రమైన పులకింత!”