[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘అపురూపాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బడి అంటే
గుడికి ఇష్టం..
పాఠాలతో చిగురించే
బాల్యాన్ని దీవిస్తుంది.
పుస్తకం అంటే
దేవుడికి ప్రాణం
అక్షరంతో వెలిగే
దీపాలను చూసి పొంగిపోతాడు.
పరీక్ష అంటే
పూజకి ఈర్ష్య
ఎదిగే మనసుని
కొలిచే మూల్యాంకనాన్ని ప్రేమిస్తుంది.
గురువు అంటే
లోకానికి భక్తి
కనిపించని దైవాన్ని
ప్రత్యక్షంగా చూస్తూ తరిస్తుంది.