[కరణం లక్ష్మీ శైలజ గారు రచించిన ‘అపుడు కదా ఉగాది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]


కోరుకోవాలి అందరి మంచినీ
అందరి జీవితాల్లో సంతోషం నిండాలనీ
ఎవరికీ తలపెట్టకుండా హాని
అందరికీ మన సహకారం అందివ్వాలి
అపుడె కదా మానవాళికి నిజమైన ఉగాది
లక్ష్య సాధనకు శ్రమించాలి
కఠోర దీక్షతో మన లక్ష్యాన్ని సాధించాలి
మన కలలు సాకారం చేసుకోవాలి
చేరుకోవాలి మన ఆశల పందిరిని
అపుడె కదా మానవాళికి నిజమైన ఉగాది
ఆడపిల్లలను గౌరవించాలి
వారి ఆలోచనలను మన్నించాలి
అడ్డుకోరాదు వారి అభ్యున్నతిని
అందివ్వాలి వారికి మన చేయూతను
అపుడె కదా మానవాళికి నిజమైన ఉగాది
నమ్మాలి పసిపిల్లలందరూ దైవస్వరూపాలని
వారి చిరునవ్వులు ఇస్తాయి మనసుకెంతో హాయిని
వారి అభ్యున్నతికి శ్రమించి చేయాలి విద్యాదానం
ఇస్తుంది వారి ఉన్నతి మనకెంతో తృప్తిని
అపుడె కదా మానవాళికి నిజమైన ఉగాది
మరువరాదు కన్నవారి బాధ్యతను
వారి యోగక్షేమాలు ముందు, పిదప మన పిల్లలవి..
పెద్దవారైన పసిపిల్లలు వాళ్ళు
మనం ఆడైనా, మగైనా పెద్దలుండాలి మన వెంటే
అపుడె కదా మానవాళికి నిజమైన ఉగాది