Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-9

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

చీర

~

అది ఆరు గజాల
ఏకతంత్రీ సంగీత వాద్యం

దీర్ఘవృత్త రేఖామార్గంలో
గుండ్రంగా ఊగే ఆమె వెన్నెముకను
గుడ్డపొరల్లోంచి కనిపింపజేస్తుంది అది;
ఆమెను ఋతువులలో చుట్టేస్తుంది.

వంక లేని ఆమె చీర కుచ్చిళ్లు
అసంపూర్ణ స్తబ్ధతలో కరిగిపోతాయి

మౌనం ఆవరించిన
ఆమె పొట్ట ముందరి భాగంలో
ఏడు తరంగాలున్నాయి

ఆంగ్లమూలం: ఎస్. చంద్రమోహన్

అనువాదం: ఎలనాగ

Exit mobile version