Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-6

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

తోట

~

నేనుండేది ఇక్కడే.
నువ్వు నన్ను సందర్శించటానికి వచ్చినప్పుడు
ఒక తోటను తెస్తావు. అక్కడ ఉన్న పాము పట్టుపాప. అది నీ
అచుంబిత చర్మం మీద జరాజరా పాకుతుంది. మనం కూర్చుని
మద్యం తాగుతూ సెక్స్ పరికరాల గురించి మాట్లాడుకుంటాం.
దేన్నైతే మనకు ఇవ్వరో దాన్ని పిచ్చిగా కోరుకుంటాం. నీ మెత్తని
ఉన్నికోటు మడతల మధ్యలోంచి తొంగిచూసే గోధుమ వర్ణపు
కనుకొలకుల్ని వీక్షిస్తాను నేను. ఆనందంగా ఉన్న నీటిగుర్రం ఒకటి
మనమధ్య టేబులు మీద ఉంటుంది. దాని తలేమో నా నోట్లో..

ఆంగ్లమూలం: అశ్విన్ విజయన్
అనువాదం: ఎలనాగ

Exit mobile version