Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-51

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

భూమి చివర

~

ద్దీగా ఉన్న ఓడరేవును వీడి
కొత్త రైలుస్టేషనుకు వస్తాం మేము
జీవితమంతా ఇలానే
పోటీ పడతాం సమయంతో
ఈ ప్రయాణం పునరావృతమౌతుంది
కానీ గమ్యం అనబడే ప్రదేశానికి
ఎప్పుడూ చేరుకోం
ఒక విషయం చెప్పాలి నీకు:
నేనొక దేశద్రిమ్మరి కొడుకును
ప్రేమ, మరణం మా జీవన
విధానాలు తప్ప మరేం కావు
తోవలోనే అన్నీ సంభవిస్తాయి మాకు

చైనీస్ మూలం: జిడిమాజియా
ఆంగ్లానువాదం: వాంగ్ పిన్
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version