Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-5

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

రద్దు

~

గుష్కోరా నుండి గోవా దాకా
వర్షం పడుతోంది
“మనోహరంగా ఉంది” అన్నావు నువ్వు

రైలుకిటికీలోంచి చూస్తుంటే,
చీకటి నిండిన పొలాలకు
మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తూ
మెరుపులు, పిడుగులు..

వయసు పైబడినా
యవ్వనంతో ఉన్న నేను
నా స్మృతివ్యవస్థలోంచి
కొంత భాగాన్ని రద్దు చేస్తాను

నువ్వు దీన్ని చదువుతున్న ఈ వేళలో
వర్షం కురుస్తోంది
తడిసిన మాసికలు
లోపలి ఖాళీలను దాస్తున్నాయి.

ఆంగ్లమూలం: అమిత్ శంకర్ సాహ
అనువాదం: ఎలనాగ

Exit mobile version