Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-48

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ప్రతిదీ

~

సోపాన క్రమంలో
అపరిమితంగా ఒదిగిపోవడం
అన్నిటినీ శూన్యం వైపు నెడుతుంది
నిరర్థకతను విలువగా కలిగిన
పిల్ల కణుపులు, చెట్టునుండి రాలిపడే
ఆకులు పువ్వులు కాయలు –
వీటిలో ఏవీ పిల్లల సమూహంలో చేరవు

శూన్యం లోని శూన్యం
తయారు చేస్తుంది మనను

ఐనా బలంగా అడుగులు వేస్తూ
నేను మెట్లెక్కుతుంటే
అమరత్వం మీద కొత్తవెలుగు పడింది

కొమ్మల మీది కాకులు, చిమ్మట్లు,
వాస్తుశిల్పులు, చేతిఱంపాలు,
ప్రజాస్వామ్యవాదులు –
అన్నీ ఉన్నాయి మెట్లదారిలో.
రాత్రి మూడు గంటలప్పుడు
వెలుగుతూ ఎర్రని చంద్రుడు!

ఆంగ్లమూలం: ఫ్యానీ హౌ
అనువాదం: ఎలనాగ

 

Exit mobile version