Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-46

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

పూజ

~

బెనీ!
నీ కన్నులలో వెన్నెలరాత్రి లోని
నక్షత్రాల కాంతులున్నాయా?
తన ఇంటివైపు ప్రవహిస్తున్న నదిలోని
ప్రశాంతమైన నీటి కెరటాలా నీ నయనాలు?
ఆగామి ఉషస్సులో
దూరాన్ని మరుగుపరిచే యవనికలా అవి?
విను
నాలోని నీరు నీలోపలి చేపలను
ఊపిరాడకుండా చేయలేదు
నా తెమ్మెరలు నీ పక్షినడకను
తొట్రుపాటు పడేలా చేయలేవు

నా పదాలు నిన్ను నీ యింటికి చేర్చనీ
నీ దేహంలో నా లయ నిండిపోనీ
ఈ రాత్రి నిన్ను
దేవతల ముందు పడేయనీ

ఆంగ్లమూలం: అడెసోకన్ టుండె (నైజీరియన్ కవి)
అనువాదం: ఎలనాగ

Exit mobile version