Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-41

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

నల్లని మురికి గుడ్డలు

~

దనంగా నల్లని మురికి గుడ్డలు
ఎప్పుడూ నల్లగా ఎప్పుడూ మురికి గుడ్డలు
ఇంకా కంచె.. దృశ్యం నిండా కంచె
కంచెపక్క నుండి పోయే తోవ కూడా
నల్లని ఒక మురికి గుడ్డ
దృశ్యం ఒక మురికి గుడ్డ
అది వానలో బాగా బరువెక్కింది
గాలివేగం పెరిగి, మడుగు లోంచి
ఎండ పైకి లేచినప్పుడు
అది మళ్లీ శ్వాసించగలదు
టేబులు మీద క్రమంగా చిన్నదవుతూ
వర్షంలో తడిసి మెరిసే కుర్చీ నుండి
ఇంకా వేలాడుతోంది నల్లని మురికి గుడ్డ

జర్మన్ మూలం: నడ్యా కుషెన్‌మైస్టర్
ఆంగ్లానువాదం: ఐమీ కోర్
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version