Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-39

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఒక సాయంత్రం

~

దూరాన ఉన్న ఒక పక్షి
పాడింది మళ్లీ.
తర్వాత కొసరుగా
మరికొంచెం పాడింది

నీ నీడకూ నీలోని నీడకూ,
ఇతర అన్ని నీడలకూ మధ్య
అంతరం తగ్గింది
మెల్లగా చిక్కనౌతున్న సాయంత్రం
‘నేనెప్పుడూ సాయంత్రాన్నే’ అంటోంది
ఇప్పుడు నీకు వాస్తవం
అనుభవం లోకి వచ్చింది

ఆంగ్లమూలం: జేమ్స్ రిచర్డ్సన్
అనువాదం: ఎలనాగ

Exit mobile version