Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-37

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

రాజా చక్రబర్తి కవితలు మూడు

~

(1) చిలుము
నీ సంకెళ్ల మీద
చిలుము చేరనీయకు
లోపలి సంగీతం మరణిస్తుంది

చీమలు మృతకళేబరాన్ని తిన్నట్టుంటుంది,
చిలుము పట్టిన ఇనుము
శాశ్వతంగా ఉండిపోతుంది నీతో

(2) నష్టం
నేనొక సముద్రాన్ని పోగొట్టుకున్నాను
దాని తీరం మిగిలే వుంది కానీ
కెరటాలు లేవు
నేనొక సముద్రతటం మీద నిలబడి వున్నాను
పెద్ద శూన్యమొకటి వీక్షిస్తోంది నన్ను
నా ఈ కళ్లలోకి
నీళ్లు ప్రవహిస్తాయా మళ్లీ?

(3) అంగీకృతి
ఔన్నిజమే
నేన్నిన్ను ప్రేమిస్తున్నాను
కానీ నాకంటె ఎక్కువగా కాదు
ఎందుకంటే అట్లా చేస్తే
నేను నేను కాకుండా ఉండిపోతాను

ఆంగ్లమూలం: రాజా చక్రబర్తి
అనువాదం: ఎలనాగ

Exit mobile version