Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-36

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఆనా

~

1.
గాయపు మచ్చలమీద గాయాలు చేయడం
పాపం అంటాన్నేను
జవాబుగా నా దరహాసాన్ని దర్శించు
హృదయపు రాచపుండ్లలో
సదమల కాంతిని వీక్షిస్తాను నేను
2.
అపరాధ భావం లేకుండా కాటు వేస్తాను
ఈరోజు ఒక సాత్విక పులి.
ప్రేమ మూల్యాలనూ
ప్రణయ కలాపాలనూ నువ్వు ప్రస్తావించవు
3.
పరుష వాక్యాలనూ ప్రేమనూ,
రాయబడిన వాక్యాలలోని ఉధృతినీ
ఒడిసి పట్టు
4.
ఇదొక కొత్త అధ్యాయం
లోపలిహృదయం నా ఛాతీమీద పతకమై వేలాడుతోంది
నేనెక్కడో తప్పు చేశాను
నా హృదయం, ఆంతర్యం పోరు సలిపాయి
ఆడతనపు విధానం ఆ దేవుడిచ్చాడు నాకు
“మళ్లీ” అనే మాట తటస్థించింది నాకు
ఆవరణలో అంతటా ఆవేదన శకలాలు
దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలెయ్యాలి?

రష్యన్ మూలం, ఆంగ్లానువాదం: ఆనా మే (అలినా రేలెవ్నా మఖ్ముతోవా)
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version