Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-35

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

పూలకారు

~

ది ఇక్కడే.
కానీ రంగులు మొహం చాటేశాయి
ఎవరికీ అతిథులు కానివి
నల్లని మొగ్గల లోపలికి
ముఖాలను ముడిచాయి
అచ్చెరువొందుతూ తెల్లని ఆకాశం..
పరిమళం పాతదే అయినా
ప్రవహిస్తున్నాయి నదులు
జాగృతంగా ఉన్న జింకలలాగా ప్రజలు
మెరుగు మాసిన గిడ్డంగులలో
సుందర దృశ్యాలను వెతుకుతున్నారు
ఆకుపచ్చనిదేదీ అరుదెంచడం లేదు
ఆకాశం మాత్రం ఆశగా వాలింది
సూర్యుడు మండుతూనే ఉన్నాడు

ఆగ్లమూలం: గ్రెగ్ కుజ్మా
అనువాదం: ఎలనాగ

Exit mobile version