Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-34

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

పోగలను కానీ పోను!

~

ఇక నేను వెనుతిరిగితే మంచిదేమో

నా రెండు చేతులకు ఎంతో బురద
అంటించుకున్నాను – ఎంతో కాలంగా!
నేను మిమ్మల్ని ఎప్పుడూ కేవలం మీకోసం తల్చుకోలేదు

రాత్రివేళ లోయ అంచు మీద నిల్చున్నప్పుడు
రా, రా టూ చంద్రుడు పిలుస్తాడు నన్ను
నిద్రలో గంగానదిఒడ్డు మీద నిల్చున్నప్పుడు
రా, రా అంటూ శ్మశానంలోని చితి పిలుస్తుంది

అటో యిటో పోగలను
కానీ ఎందుకు పోవాలి?

నా చిన్నపాప ముఖాన్ని పట్టుకుని
మరోసారి ముద్దు పెట్టుకుంటాను

పోతాను కానీ ఇప్పుడే పోను
మీ అందర్నీ వెంట తీసుకుపోతాను
ఒంటరిగా, వేళ కాని వేళ పోను

ఆంగ్లమూలం: శక్తి చట్టోపాధ్యాయ్
అనువాదం: ఎలనాగ

 

Exit mobile version