Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-33

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

టమాటాల ధర

~

డు దశాబ్దుల క్రితం
కైలాసగిరి శిఖరాన్ని ఎక్కలేకపోయినందుకు
చింతిస్తున్నాను, అన్నది అమ్మ

తర్వాత వెంటనే,
డైనింగ్ టేబులు మీద
ఉన్న టమాటాల గుట్టను చూసి
అడిగింది వాటి ధర ఎంత అని.

సగం ధరకే కొన్నానని చెప్పగానే
హాయిగా నవ్వింది ఆమె
పర్వతాన్ని ఎక్కలేకపోయినందుకు
పడిన తన జీవిత కాలపు దిగులును
టమాటాల తగ్గింపు ధర రూపుమాపినందుకు
ఆమె ఆనందించడం
ఆహ్లాదాన్ని కలిగించింది నాకు

ఆంగ్ల మూలం: శోభా నారాయణ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version