Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-32

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

క్షమాగుణం

~

రిచితమైన పాట చరణం
గాఢ నిశ్శబ్దంలో గానమై నినదించినట్టు
ఊపిరాడనీయని చీకటిలో
నా మదిలోకి వస్తావు నువ్వు
పచ్చదనం నిండిన కొత్త మైదానంలోకి
పరుగెత్తాలనే నిర్ణయం నీదే
విధి వెలార్చిన ఉన్మాదపు ఊహలో
అందంగా చెక్కబడిన నీ జీవితం
ఒక గాయానికి లేపనం రాస్తూ
రాజీ కోసం ప్రాధేయపడింది
మసకచీకటి గొడుగు కాగా,
దానికింద సప్తవర్ణాలను మెరిపిస్తూ
కలబోశాను విస్మృత గాథల్ని.
“సమయం అయిపోయింది” అని
ఒక మంద్రస్వరం నాలో గుసగుసగా అంటుంది
బాలుణ్ని ఆశ్చర్యంలో ముంచెత్తే
నక్షత్ర భరిత ఆకాశం వైపు చూస్తాను
కరుణ శిలువ వేయబడి,
పాలలాటి చీకటిలోంచి కారుతుంది ధారగా.
నేను సులభంగా క్షమిస్తాను

ఆంగ్లమూలం: అమితా రాయ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version