Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-26

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

కవిత్వం కోసం మాత్రమే

~

జీవితం కవిత్వం కోసం మాత్రమే
కొన్ని కేళులు కవిత్వం కోసం మాత్రమే
కవిత్వం కోసమే నేను అతిశీతలమైన మునిమాపులో
అనంత విశ్వాన్ని దాటుతుంటాను
కవిత్వం కోసం మాత్రమే
రెప్ప వేయని ప్రశాంత వదనమొకటి
ప్రశాంతిని ప్రసాదిస్తుంది
ఓ మగువా, నువ్వున్నది కవిత్వం కోసమే
కవిత్వం కోసమే రక్తతర్పణం, మేఘవిస్ఫోటనం
నేను చాలా కాలం బతకాలనేది కవిత్వం కోసమే
మనుషులు క్షోభ నిండిన జీవితాన్ని గడిపేది
కవిత్వం కోసం మాత్రమే
నేను అమరత్వాన్ని తిరస్కరించింది
కవిత్వం కోసం మాత్రమే

బెంగాలీ మూలం: సునీల్ గంగోపాధ్యాయ్
అనువాదం: ఎలనాగ
(ఇండియన్ లిటరేచర్ పత్రిక సౌజన్యంతో)

Exit mobile version