Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-20

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

చిరునవ్వు

~

చిరునవ్వు చిత్రమైనది
ముఖం మీద ముడుతలు పుడుతాయి దాంతో
అది అదృశ్యమయ్యాక
అగోచరం దాని రహస్య స్థావరం

చిరునవ్వులేం చేస్తాయని యోచిస్తే
మరింతగా నివ్వెరపోతాం మనం
ఒకతణ్ని నువ్వు నవ్వుతో పలుకరిస్తే
నవ్వుతోనే బదులిస్తాడతడు
కాబట్టి, రెండు నవ్వులు నెలకొంటాయి అప్పుడు

ఆంగ్లమూలం: మార్గరెట్ బర్న్స్
అనువాదం: ఎలనాగ

Exit mobile version