Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-17

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

శూన్యం

~

రీరం వెల్లకిలా పడుకుని ఉంటుంది
ఆత్మ, కాలిమునివేళ్ల మీద భారరహితంగా నడుస్తూ,
నిస్సత్తువగా దొర్లే తనకెదురుగా వున్న పుస్తకాల బీరువా వైపు నడుస్తుంది
లాంతరు యక్షిణిలా కన్ను గీటుతుంది

సాలీడు ఒకటి మెదడులో పేరుకుపోయిన
కథల స్తుతివాక్యాల చుట్టూ సాలెగూడును అల్లుతుంది
కళ్ల కారిడార్లలో గడువుతేదీలను వెంటాడుతుంది ఆత్మ
ఆపైన బడలికతో శీర్షికల్ని
ఖాయం చేసుకుంటుంది

ఒక్క పేజీని కూడా తిప్పకుండానే
సాయంత్రం మెల్లగా గడిచిపోతుంది

ఆంగ్లమూలం: మందాకినీ భట్టాచార్య
అనువాదం: ఎలనాగ

Exit mobile version