Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-16

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఒక నాస్తికుని మనస్తాపం

~

దేవుణ్ని లక్ష్యపెట్టకపోవటం
అనే యిది సౌకర్యంగా లేదు
భావప్రాప్తి విషయమూ అంతే
మనిషి సవ్యంగా సజావుగా ఉంటాడు నిజమే కానీ
పారవశ్యం కోసం దేవుడు కావాలి
పుస్తకాలు లేని, విశ్వాసం లేని, దేవుడు నిండిన
నా బీరువా అరలో ఆడవాళ్లకొక
ప్రత్యేకమైన స్థలం ఉంది – అది నిజమే
వాల్‌పేపర్‌తో తెల్లగా మెరిసే గోడ మీద నా దేవుళ్లు
దండలతోనో దండలు లేకుండానో వేలాడటం నాకు ఇష్టమే
నాస్తికుని జీవితంలో ముళ్లలా గుచ్చుకునే సమయాలుంటాయి
తప్పు తీర్పులు దుష్టులు
ఉన్నందుకు ఎవర్ని నిందించాలి?
నెమ్మదీ విసుగూ నిండిన రచయిత బతుకుతో ఏం చేయాలి?
నాకు దిగువన ఉన్న మనిషిని చూస్తున్న నన్ను పైనుండి
దేవుడు చూడ్డం లేదు

ఆంగ్లమూలం: శ్రీవిద్యా శివకుమార్
అనువాదం: ఎలనాగ

Exit mobile version