Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంటు మామిడి తోట కాడ

అంటు మామిడి తోట కాడ
అంటు కోకు మామయ్య
అంటుకుంటే నా మనసు
అంటుకుంటది ఓరయ్యో- మావయ్యో – ఓరయ్యో ॥అంటు॥

నా బుగ్గ గిల్లి పోతే
మావిచిగురు కెంపుదేరే… ॥నా॥
నా పెదవి పంట నొక్కితే
పాలకంకి పాలుగారె – పాలుగారె – పాలుగారె ॥అంటు॥

నీ చూపు సోకగానె
నా పైట జారిపోయే ॥నీ॥
నీ చెయ్యి తాకగానే
పరువాలె సోలి పోయె – సోలిపోయె – సోలిపోయె ॥అంటు॥

నీ జాడ తెలియక
నేలంతా నెఱ్ఱలసే ॥నీ॥
నీ అలికిడి కాగానె
తొలకరి జల్లే కురిసె – జల్లే కురిసె – జల్లే కురిసె ॥అంటు॥

నీ పిలుపు వినగానె
పువ్వే పులకించి పోయే… ॥నీ॥
నీ కౌగిలి చేరగానె
సిగ్గే నను విడిచిపోయె-విడిచిపోయె-విడిచిపోయె ॥అంటు॥

Exit mobile version