Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతర్వాహినికి హారతి

[నెల్లుట్ల సునీత గారి ‘అంతర్వాహినికి హారతి’ అనే రచనను అందిస్తున్నాము.]

గోళంలో గమనం
చంద్రాది గతులలో
గురు సంచారం
త్రివేణి సంగమలో
అంతర్వాహిణికి పుష్కరం
పన్నెండు వత్సరాలకు వైభవం
అమృత బిందువులతో
పుణ్యస్నానం సర్వ పాప హరణం
శక్తి నింపే జీవన సారం
మహోన్నత ఘట్టంతో
పునీతమవును జీవితం
ముక్తేశ్వర దర్శనంతో
తరించున భక్తకోటి
వరప్రదాయని జ్ఞాన స్వరూపిణి
వీణపాణి నదీమ తల్లిని
భక్తి పారవశ్యంతో
పూజించే సంస్కృతి
పితృదేవతల తర్పణ ఆరాధనలు
లోక రక్షణకై యజ్ఞయాగాదులు
సంస్కృతులు ఉట్టిపడిన
త్రిలింగ క్షేత్రం
ఆధ్యాత్మిక శోభతో విలసిల్లేను
కాలేశ్వరం
ప్రాణికోటి మనుగడకు
జలమే ఆధారం
నదులను ప్రకృతిని పూజించే
సనాతన మార్గం
వేద ఋషులు నొసిగిన
మన హిందు సంప్రదాయం
జీవన్మోక్తికి భక్తి మార్గమే సుగమం

Exit mobile version