Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతం ఎప్పుడు?

లనాటి…
శ్రీలక్ష్మి, ప్రణీత, ఆయేషాల
బాధాతప్త గాథలు…!

నిన్న మొన్నటి
అనూహ్య, ఆసిఫాల
తల్లిదంద్రుల కన్నీటి వ్యథలు…!

నిర్భయ అదృశ్యం
నిర్భయ చట్టం ఆవిష్కృతం…!
ఐనా
కొనసాగుతున్న అత్యాచారాల పర్వం…!

దిశపై ఆటవిక దాడి
ఎన్‌కౌంటర్లతో
దిశానిర్దేశం…!

అయినా
ఎందరెందరో
మృగాళ్ళకి బలి
మనకి కన్పించే ‘బలిచక్రవర్తిణులు’
పదులూ! వందలే!

కానీ
కన్పించని వేల వేల ఆర్తనాదాలు
వీటికి అంతం… ఎప్పుదు? ఎప్పుడు? ఎప్పుడు?

Exit mobile version