Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అన్నీ నీవే..

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘అన్నీ నీవే..’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

నీ కనులలో కాంతి రేఖలు
నా బ్రతుకు బాటకు వెలుగు రేఖలు
నీ నుదుటన తూరుపు సిందూరం
నా భవితకు జీవన ఆధారం
నీ దరహాసపు చిన్ని పెదాలు
నా భావ కవితకు చిరు పదాలు
నీ మురిపాల సొట్ట బుగ్గలు
నా మదిలో చిగురించే మల్లె మొగ్గలు
నీ చుబుకాన పుట్టుమచ్చలు
నా గుండెపై పచ్చ బొట్టులు
నీ దానిమ్మ గింజల పళ్ళు
నను ఖైదు చేసిన సంకెళ్ళు

Exit mobile version