సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ప్రేమ లోని గాఢతను, జీవితం లోని తాత్త్వికత ను వ్యక్తీకరించే సాహిర్ ఈ శృంగార గీతాన్ని ఎలా రాసి వుంటారో అనుకున్నాను – జ్యోతి గారి విశ్లేషణ మొదటి పేరా చదవగానే.
    తన కోరిక ను సూటిగా తెలుపుతూనే, ఎంత ఆరాధన తో చెప్పాడంటే – “గర్భగుడి బైట గంటల కొద్దీ వేచి వుండి తీరా ఆ విగ్రహం దగ్గర కు వెళ్లి చూడగానే భక్తుడి లో కలిగే భావం” అని జ్యోతి గారు చెప్పడం – బహుశా ఇంతకంటే అద్భుతం గా ఎవరూ చెప్పలేరేమో! ఇంతవరకూ ఆమె కూడా ఇంత అద్భుతమైన పోలికను చెప్పలేదు. ఎంత ఉద్వేగం, ఎంత పవిత్రత ఉంది!
    అయితే ఈ పాట చిత్రీకరణ చాలా సాధారణంగా ఉంది.
    కాశ్మీర్ కీ కలీ కూడా మామూలు గా ఉంది. అప్పటికీ ఇప్పటికీ “రూప్ తెరా మస్తానా” పాట, చిత్రీకరణ పూర్తిగా భిన్నమైంది. హీరో లో ఉవ్వెత్తున ఎగసిన ప్రేమ, హీరోయిన్ లో కూడా ప్రేమ – అంతకంటే ఇది తప్పో, ఒప్పో, తప్పనిసరో అనే ఒక సహేతుకమైన మానసిక స్థితి షర్మిల మోములో ప్రకటించగలిగింది.
    ఇక ఈ అమానత్ పాట విషయానికి వస్తే క్రెడిట్ మొత్తం సాహిర్ కే చెందుతుంది.
    కేవలం శారీరక సౌందర్యం, శృంగారం మాత్రమే కాదు, “జిందగీ భర్ కా హై అబ్ సాథ్ కరీబ్’ అంటున్నాడు. ఇలాంటి నిజాయితీ, తోడు కోరుకుంటుంది కదా స్త్రీ.
    స్త్రీ హృదయాన్ని చదివాడు కనుకనే సాహిర్ ఇంత హృద్యంగా రాయగలిగాడు.
    మంచి సాహిత్యం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!