తిరుపతి రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచన ‘మేకల బండ’కు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు ప్రథమ నవలా పురస్కారం లభించింది. 24/12/2024 న హనుమకొండ లో జరిగిన కార్యక్రమంలో రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ ఈ పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి డి. స్వప్న, సాహితీ ప్రియులు గిరిజా మనోహర బాబు, మిట్టపల్లి రాజేశ్వర్, కర్రె సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.