Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మంటే..!

మ్మంటే…
ఒక లాలన
ఒక దీవెన
ఒక ప్రేరణ

అమ్మంటే…
ఒక స్ఫూర్తి
ఒక మూర్తి
ఒక కీర్తి

అమ్మంటే…
ఒక ఊయల
ఒక కోవెల
ఒక వెన్నెల

అమ్మంటే…
ఒక త్యాగం
ఒక మేఘం
ఒక భాగం

అమ్మంటే…
ఒక ఉషస్సు
ఒక యశస్సు
ఒక తేజస్సు

Exit mobile version