Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ

[డా. షహనాజ్ బతుల్ రచించిన ‘అమ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

ముద్రము చెప్పింది.
అమ్మ ఒక ఆల్చిప్ప లాంటిది.
తనలో కన్నీటి బిందువుల్ని, దాచు కొంటుంది.

మేఘము చెప్పింది.
అమ్మ ఒక అల
దాని నుండి మెరుపు మెరుస్తుంది.

కవి చెప్పాడు.
అమ్మ తన మనస్సు లో
బాధను దాచుకునే కవిత.

గాయకుడూ చెప్పాడు.
అమ్మ హృదయ తంతుల్ని మీటే ఒక రాగము.

సంతానము చెప్పింది.
అమ్మ, ఒక వెల కట్టలేని అనురాగం.

దేవుడు చెప్పాడు.
అమ్మ, నాకు వరం లాంటిది.

పెయింటర్ చెప్పాడు.
అమ్మ, సందేహాన్నుంచి,
చిత్రం గీయ గలిగే కుంచె.

భూమి చెప్పింది.
అమ్మ, సహనము లో నన్ను మించినది.

అగ్ని చెప్పింది.
అమ్మ, నన్ను సైతము,
చల్లబరిచే తైలము.

గాలి చెప్పింది.
అమ్మ, నా కంటే ఎక్కువ,
చల్లదనాన్ని ఇస్తుంది.

అమ్మ, ప్రేమకు పరాకాష్ట,
అమ్మ, త్యాగానికి ప్రతిరూపము.
అమ్మ ఋణము తీర్చుకోలేనిది.

Exit mobile version