[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ఈ భూమి మనిషి ఒక్కడిదే కాదు – ప్రాణికోటి అంతటిదీ:
ఆవాసాల ధ్వంసం వంటి పలు కారణాలుగా తెల్లమచ్చల చిరుత మనుగడ ప్రమాదంలో పడింది. 2023 data ప్రకారం అవి 10,000 వరకు మాత్రమే మిగిలాయి. ఇటీవల W.W.W. లో K.K నేషనల్ పార్క్‌లో ఆ జాతి చిరుతలు ఒక తల్లీ పిల్లా కనిపించాయి. దానితో ఆ అటవీ ప్రాంతం వాటి మనుగకకు అనుకూలంగానే ఉందని ప్రకృతి పరిరక్షకులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది.
ఎగిరే ఉడుత 30 సంవత్సరాల క్రిందట 1994 లో ఆఖరు సారిగా కనిపించింది. మళ్లీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మియార్‌లో కనిపించింది. అంతరించిపోయాయనుకొంటున్న బట్టతల మేకలు మళ్లీ వృద్ధి చెందుతున్న
దాఖలాలు న్యూ జెర్సీలో కనిపించాయి. నెబ్రాస్కాలో దశాబ్దాల అనంతరం బీటిల్ జాతి సంతతి వృద్ధి చెందుతున్నట్లు కనిపించింది.
సౌత్ ఈస్ట్ క్వీన్‌లాండ్‌కి చెందిన మేరీ రివర్ తాబేళ్లు అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి వెళ్లిపోయాయి. వీటి సంఖ్య 80% మించి పడిపోయింది. వీటి సంఖ్య 10,000 మించి ఉండదని అంచనా. ఈ జాతిని కాపాడటానికై వలంటీర్లు 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఈ మంచినీటి జీవులు తోక లోని గ్రిల్స్ వంటి ఖాళీలతో ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. ఈ విశిష్టమైన శ్వాసించే ప్రక్రియ కారణంగా వీటికి ‘బమ్ బ్రీథింగ్ టర్టిల్స్’ అని పేరు కూడా వచ్చింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలల కాలం వీటి సంతానోత్పత్తి సీజన్. అటువంటి 30/40 ప్రాంతాలకు 17 మాత్రమే కనిపించాయి.
దశాబ్దాలుగా ఫార్మా వ్యర్థాలు, విష రసాయనాలు వివిధ రకాల జీవులు/జంతువుల జాతులపై ప్రభావం చూపిస్తున్నాయి. వాటి ప్రవర్తన, స్వభావం, పునరుత్పత్తి, అభివృద్ధి వంటి అంశాలపై ఆ ప్రభావం పడుతోంది. చేపలు వంటి అనేక జీవుల మెడదు పనితీరు మారుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. సుమారు 185 సంవత్సరాల తరువాత నేపాల్ లోని చెరువులో అతి చిన్న Otter కనిపించింది. న్యూ మెక్సికోలో మంచినీటి అట్టర్స్ (చెరువులు) మళ్లీ వృద్ధి చెందుతున్నాయి.
150 సంవత్సరాల తరువాత కాలిఫోర్నియా ద్వీపంలో శరీరం అంతా జూలు ఉండే సీల్ చేపలు మళ్లీ కనిపిస్తున్నాయి.
అరిజోనాలో 50 ఏళ్ళ తరువాత ఒకెలాంట్ కెమెరా కంటికి చెక్కింది. దక్షిణ అమెరికాకు చెందిన అతి పెద్ద పక్షి హార్పీ ఈగల్ అంతరించిపోయిందని అనుకున్నారు. 40 పౌండ్ల బరువుతో 6 అడుగుల రెక్కలతో ఉండే ఈ జాతి గ్రద్దలు కనిపించడం మానేసి చాలా కాలం అయ్యింది. మెక్సికో దక్షిణ ప్రాంతంలో వర్షారణ్యాలలో స్థానిక తెగలవారు దానిని గుర్తించగలిగారు. అదీ ఒక గైడ్ తీసిన ఫొటోతో.
ఉష్ణమండల ప్రకృతి వ్యవస్థల తీరుతెన్నులలో పిహెచ్.డి. చేసి ప్రకృతి పరిరక్షకుడిగానూ చర్యలు చేపడుతున్న Alan Monroy-Ojeda “ఇప్పుడు ప్రపంచానికి మేము హార్పీ ఈగల్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయని, అంతరించి పోలేదని చాటి చెప్పగలం” అని ఉద్వేగంగా అన్నారు. కారణం లేకపోలేదు. ఆ జాతి గ్రద్దలు ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కేవలం ఒక గుడ్డు మాత్రమే పెడతాయి.
అంతరించిపోయాయని భావిస్తున్న ఆ విశేషమైన జాతి అంతరించిపోలేదని – ఇంకా అక్కడక్కడ ఉన్నాయని తెలిసినపుడు ఉద్విగ్నత సాధారణమే. ఆయన మెక్సికోలో బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్‌ను గుర్తించచడం, సంరక్షించడం వంటి విధులను నిర్వహించే సంస్థ డైరెక్టర్. 2003 లో స్పెయిన్‌లో బంగారు గ్రద్దలు (గోల్డెన్ ఈగల్స్) దాదాపు అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు అక్కడ వాటి సంఖ్య పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు చెప్తున్నాయి.
గ్లోబల్ మిషన్ ప్రాజెక్ట్:
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లు, రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీ, డేటాబేస్డ్ సాంకేతికతలు వంటి ఆదునిక హంగులతో గతంలో అసాధ్యం అయిన అధ్యయనాలను సాగిస్తోంది. ప్రకృతి పరిరక్షణ సంస్థలు/వ్యక్తులు కనిపించకుండా పోతున్న జాతుల జంతువుల గురించి అన్వేషణలు జరుపుతున్నారు. ఏదైనా ఒక స్పీషిస్‍కు చెందిన జంతువు/జీవి కనిపించకుండా పోయి 10 సంవత్సరాలు దాటితే ఆ సమాచారం రికార్డ్ చేయబడతుంది.
‘ఒమిటెమి’ కుందేళ్ళు అధికారికంగా 1904 లో ఆఖరిసారి కనిపించినట్లు డాక్యుమెంట్ కాగా 120 సంవత్సరాల తరువాత మళ్లీ కనిపించింది. ఇవి ఎక్కువగా కోనిఫర్ అడవులలో నివసిస్తాయి. మెక్సికోలో చాలా తక్కువగా అధ్యయనం చేయబడిన ప్రాంతం ఇది. తగిన నిధులు లేవు. స్థానికుల సహకారం, అవగాహనలతో వీటి సంరక్షణా చర్యలు చేపట్టబడుతున్నాయి.
ఆసియా ఒట్టర్ జాతి నీటికుక్క 1839 నుండి కనిపించడం లేదు. నేపాల్‍లో 185 సంవత్సరాల తరువాత కనిపించింది. ఒట్టర్స్, పక్షుల అధ్యయన పరిశోధకుడు విక్రమ్ శ్రేష్ఠ్ వీనిని గుర్తించి ధృవీకరించడం జరిగింది. ఇవి ఉన్నచోట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్టు లెక్క. గతంలో నేపాల్‌లో నదులు కాలుష్యంతో నిండిపోయినప్పుడు ఇవి అక్కడ నుండి వేరే ప్రాంతాలకు వలసపోయి ఉండవచ్చు. భూ ఉపరితలంలో 1% కూడా లేని మంచినీటి వనరులు రమారమి 10% జీవుల మనుగడకు ఆధారం అవుతున్నప్పుడు అవి కలుషితమైపోతే, ఇటువంటి పరిణామాలు సహజమే.