[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
రష్యా, గ్రీన్లాండ్, అలాస్కా, కెనడాలలో హెచ్చు స్థాయిలో విస్తరించి ఉన్న పెర్మాఫ్రాస్ట్ మరి కొన్ని దేశాలలోనూ ఉంది. ఇది అతి వేగంగా కరుగుతూ వస్తోంది. కనీసంగా రెండు సంవత్సరాలు, శతాబ్దాలు, అంతకు మించిన పురాతనమైన ఈ నిక్షేపాలు కరిగితే, చాలా జనావాసాల పునాదులు కదిలిపోయి రమారమి 3 మిలియన్ల ప్రజలపై ఆ ప్రభావం పడుతుందని అంచనా. క్లైమేట్ మార్పుల కారణంగా ఈ పెర్మాఫ్రాస్ట్ కరిగే వేగం పెరిగింది. Co2, మీథేన్ వంటి హరితగృహవాయువులను విస్తారంగా శోషించుకుంటూ వస్తున్న ఈ పెర్మాఫ్రాస్ట్ కరగటం పెరిగిపోతే ఆ నిక్షేపాలన్ని ఉద్గారాలుగా వాతావరణంలోకి విడుదల అయిపోతాయి.
కరుగుతున్న పెర్మాఫ్రాస్ట్ ఆర్కిటిక్ వాసుల జీవితాలను ఎలా, ఏ మేరకు ప్రభావితం చేయగలదన్న అంశంపై వియాన్నా యానివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు అంతర్జాతీయ నిపుణులతో కలసి చేసిన అధ్యయనాలలో అనేక వాస్తవాలను గుర్తించడం జరిగింది. ఈ బృందంలో ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, ఆరోగ్య రంగ నిపుణులు, సాంఘికశాస్త్రవేత్తలు వంటి పలువురు నిపుణులు ఉన్నారు.
పెర్మాఫ్రాస్ట్ కరుగుతున్న చోట భూమిపైనున్న భవనాలు, రహదారుల వంటిని దెబ్బ తింటున్నాయి. తీర ప్రాతాలలో పునాదులు బీటలు వారుతున్నాయి. ఆర్కిటిక్ పెర్మా కరగటంతో అందులో నిక్షిప్తమై ఉన్న మాలిన్యాలు, రకరకాల బ్యాక్టీరియా విజృంభించే అవకాశం ఉంది.
గతంలో నేలలో పూడ్చిపెట్టిన చమురు, సహజ వాయువు విసర్జితాల మాలిన్యాలు, స్థానిక జల వనరులలోనికి ఇంకే ప్రమాదం ఉంది. దశాబ్దాల క్రిందట ఇటువంటి ఉత్పాతాలను ఊహించని కారణంగా అనేక పరిశ్రమలు వ్యర్థాలను భూమిలో ఇంకుడుగుంతల లోనికి వదిలివేశాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా వైరస్లు, పాథోజెన్స్ విజృంభించే అవకాశాలూ ఎక్కువే. ప్రజారోగ్యానికి సంబందించిన ఈ అంశాలన్నీ ఆర్కిటిక్ ప్రాంతాల ఆరోగ్య నిర్వహణ వ్యవస్థలపై ఒత్తిడికి కారణం కాగలవు.
అతి సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా 20 నిమిషాలకు ఒకసారి క్రొత్త జనరేషన్‌కు కారణం అవుతూ ఉంటంది. ఈ లెక్కన సంవత్సరంలో బ్యాక్టీరియా ఎన్ని తరాలు వృద్ధి చెందుతుందో అంచనా వేయవచ్చు. ఏ జీవులలో/ప్రాణులలోనైనా తరానికి, తరానికి నడుమ మార్పులు సహజం. పరిస్థితులకు అనుగుణంగా మనగలగడానికి ఆ మార్పులు సహజసిద్ధంగానే సంభవిస్తూ ఉంటాయి. ఆ కోణంలో చూస్తే బ్యాక్టీరియా తర తరానికి వాతావరణ మార్పులను తట్టుకోగల సామర్థ్యాన్ని సమకూర్చుకుంటూపోతుంది. అంత వేగంగా మనిషి ఆ మాపులను తట్టుకోగల పరిస్థితి ఉండదు. కారణం అతని జీవిత కాలం నిడివి ఎక్కువ.
1830లలో లండన్‌లో మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం సమాప్తం అయింది. వాణిజ్యంలో ఎక్కువ లాభం కనిపించిడంతో దారి మారింది. పట్టణాలకు వలసల పెరిగాయి.
1831 లో లండన్‌లో కలరా వ్యాపించింది. 1945 లోపునే అంటే 15 సంవత్సరాల లోపునే మరో రెండు సార్లు అది విజృంభించింది. 1858 నాటికి థేమ్స్ నదీజలాలు ఎంత కషితమయిపోయాయంటే, పార్లమెంటును స్తంభింప చేసేటంట. ఆ ఉదంతాన్ని ‘The Great Strick’ అంటారు. ఆ వాదోపవాదాలు ప్రజారోగ్యానికి సంబంధించిన పాలసీలను తీసుకువచ్చి, అమలు చేయక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ప్రభుత్వం రహస్యంగా జరిపించిన అధ్యయనాలలో కలరాకి కారణం వ్యర్థాలతో కలుషితమైన ఒక జల వనరు అని తగిలింది. అలా వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థలకు రూపకల్పన జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలలో ఆ అంశం కూడా కీలకమైనదిగా పరిగణించటానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మన దేశంలో కలకత్తాలో వ్యర్థాలన్నీ ఒక పెద్ద చిత్తడి నేలలోకి వదిలివేయబడేవి. 2002 లో ఆ ప్రాంతం ‘రామ్సర్’ జాబితాలో చేర్చబడి రక్షణ ఛత్రం లోనికి వెళ్ళింది.
ఆధునిక పరిశ్రమలలోని సంక్లిష్టమైన మాలిక్యూల్స్ని సైతం ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉన్న మైక్రోబ్స్‌ను అక్వా ప్లాంట్స్ మూలాలలో శాస్త్రవేత్తలు గుర్తించడం ఇటీవలి విశేషం.
You must be logged in to post a comment.
జీవన రమణీయం-39
99 పదాల కథ: తొలి చూపులో ప్రేమ
డా. సి. భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కార ప్రదానం సభ – ప్రెస్ నోట్
అభిషేకం
నూతన పదసంచిక-77
సత్యాన్వేషణ-14
నాకూ ఒక మనసున్నాదీ..!!
శతక పద్యాల బాలల కథలు-9
ఆకాశంలో తలుపు
పుట్టబడి
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®