అమెరికా ద్వంద్వవైఖరులను కవితాత్మకంగా వివరిస్తున్నారు వెన్నెల సత్యం “అమెరికా నానీలు!”లో.
నాలుకపై స్వదేశీ
నాట్యమాడుతుంది
మనసు విదేశీ
విహారం చేస్తుంది
°°°°°°°
అమెరికా మంచిదే
యుద్ధం వస్తే
పక్కోడికీ మనకు
ఆయుధాలమ్ముతుంది
°°°°°°°°
భారతంటే
భయం లేదు వాడికి
ఉత్తర కొరియా అంటే
ఉచ్చోసుకుంటాడు
°°°°°°°°°
మనోళ్ళని అమెరికా
వెళ్ళగొడుతున్నా
మనకు అది
భూతల స్వర్గం
°°°°°°°°
అమెరికా కళ్ళకి
రెండే కనిపిస్తాయి
ఆయుధాలు
ఆయిల్ నిల్వలు.