Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమాయక స్వభావులం

[శ్రీమతి జీ. సందిత రచించిన ‘అమాయక స్వభావులం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

లుపుల్లేని
బందిఖానా

ఎల్లలు లేని
పంజరం
అనే
ప్రపంచంలో,
అనుబందం
అనే
బంధాలతో

ఇరుక్కుపోయిన
రెక్కలులేని
పక్షులం మనం

మనసున్న
జీవులు పడుతున్న
విభిన్న
అనుభవాలకు
తంటాలకు
సాక్షులం మనం

మమతలతో
బలియవుతున్న
అమాయక స్వభావులం మనం

Exit mobile version