[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘అలికిడి ఆశ కోసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కరుగుతున్న కాలం
చప్పుడును వింటున్న కళ్ళు
రాత్రి రహదారులపై భయాన్ని మోస్తూ
నిద్ర అంచులపై
లెక్కించే అడుగుల్లో
కనిపించని దూరపు జవాబుకై
దిక్కును తప్పు పట్టలేక
దారి కరువుకు పైకి చెప్పుకోలేక
అలసిన పాదాల మధ్య
ముడుచుకు పడుకుని
అలికిడి ఆశ కోసం
కళ్ళలో కలివిడి ఒత్తులేసుకుని చూస్తున్నాయి.