సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నిర్మాత దర్శకుడు పలువాయి రామకృష్ణ:
రామకృష్ణ 1918లో కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసరావు స్కూల్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్. రామకృష్ణ పాఠశాలలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. స్కూల్ ఫైనల్ తర్వాత 1935లో బందరులో హిందూ కళాశాలలో చేరారు. కాలేజీ ఫీజు చెల్లించడానికి ఆయన బావ సహాయం చేశారు. 1937లో ఇంటర్మీడియట్ పాసయ్యారు, బి.ఎ. కోర్సు చేయాలని యోచించారు. కానీ బావ మరణించడంతో ఇంకా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు రామకృష్ణ.
ఆయన విధి ఆయనను వేల్ పిక్చర్స్ కార్యాలయానికి తీసుకెళ్లింది, అక్కడ ఆయన సౌండ్ రికార్డింగ్ విభాగంలో చేరారు. కానీ ఆ ఉద్యోగం ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మానేశారు. ఆ సమయంలో 1937లో దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి తమిళంలో మాతృభూమి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఆయన ఎడిటింగ్ విభాగంలో అప్రెంటిస్‌గా చేరారు. ఆప్పుడు రామకృష్ణకు 19 సంవత్సరాలు. ఈ చిత్రం 1939లో విడుదలై ఘన విజయం సాధించింది. హెచ్.ఎం.రెడ్డి గారు రామకృష్ణ పనిని ఇష్టపడి, ఆయనను తన సొంత బ్యానర్ రోహిణి పిక్చర్స్‌లో ఎంపిక చేసుకుని అసిస్టెంట్ ఎడిటర్‌గా నియమించారు. బోండం పెళ్లి, తెనాలి రామకృష్ణ, సత్యమే జయం అనే మూడు చిత్రాలు రోహిణి బ్యానర్లో వచ్చాయి, వీటికి రామకృష్ణ ఎడిటర్‌గా పనిచేసి చాలా ప్రశంసలు అందుకున్నారు.
ఈ జంట నిరాశ చెందకుండా 1952లో ‘ప్రేమ’ అనే సినిమాని నిర్మించారు. ఆ సంవత్సరం వారి జీవితాల్లో ఒక మైలురాయి. వారు సాలిగ్రామంలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, తమ కొడుకు పేరు మీద భరణి స్టూడియో అనే స్టూడియోను నిర్మించారు. వారు ఆక్కడ నిర్మించిన మొదటి చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో తీసిన త్రిభాషా చిత్రం – ‘చండీరాణి’. రామకృష్ణ 1953లో ‘బ్రతుకు తెరువు’ అనే చిత్రానికి బయటి బ్యానర్ కోసం దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ జంట వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.