Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 286

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నర్తకి, నటి అజూరీ:

అజూరీగా ప్రసిద్ధులైన అన్నా మేరీ గుయిజెలర్ 1907లో లేదా 1916లో (ఆమె జన్మ సంవత్సరం విషయంలో వివాదం ఉంది) బెంగళూరులో జర్మన్-యూదు తండ్రికి, హిందూ బ్రాహ్మణ తల్లికి జన్మించారు (ఆమె కులం గురించి అజురీ ఎకౌంట్స్ లో ముందుగా చెప్పబడింది). ఆమె బెంగళూరులో పాఠశాల విద్య అభ్యసించారు, సీనియర్ కేంబ్రిడ్జ్‌లో సర్టిఫికెట్ కూడా పొందారు.

ఆమె తండ్రి, సర్జన్ జనరల్ గుయిజెలర్, కఠినమైన క్రమశిక్షణను పాటించే వృత్తినిపుణుడు, కూతురు ఆసుపత్రిలో నర్సుగా చేయాలని కోరుకున్నారు. కొంతకాలం ఆమె తన తండ్రి సిఫార్సు మేరకు పనిచేశారు. కానీ ఎప్పుడూ నిలబడాల్సి రావడంతో ఆమె ఆ పనిని బాగా చేయలేకపోయారు.

ఆమె తండ్రి ‘ప్రాచ్య నృత్యాన్ని’ అంగీకరించలేదు. బదులుగా కుమార్తెను బ్యాలె నేర్చుకుని పియానో వాయించమని ప్రోత్సహించారు. కానీ ఆమె మనసు, రహస్యంగా చూసిన సినిమాల లోని ‘ప్రాచ్య నృత్యాల’పై ఉంది.

తల్లిదండ్రులు విడిపోయాకా, ఆమె తన తండ్రితో నివసించారు, ఆయన ఆమెని బ్యాలె నేర్చుకోవాలని ప్రోత్సహించారు కానీ ప్రాచ్య నృత్యం కాదు. తన కుమార్తెను రష్యన్ వలసదారుల బృందంతో బ్యాలె, పియానో నేర్చుకోవడానికి అనుమతించారు. అజురీ యుక్తవయస్సులో ఉండగా ఆమె కుటుంబం బొంబాయికి వెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్‌లో భాగమయ్యారు, దాంతో ఆ నిర్వాహకుడితో మాట్లాడడానికి అజురీకి వీలు కలిగింది. తన తండ్రి మరణించినప్పుడు అజురీ అతియాతో కలిసి వెళ్లింది.

బొంబాయికి వెళ్ళిన తరువాత, ప్రసిద్ధ ముస్లిం సంస్కర్త, సాహిత్యకారుడు అతియా ఫైజీ-రహమిన్, అజూరీని భారతీయ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని ప్రోత్సహించారు (భరతనాట్యం, మణిపురి మరియు కథక్ నృత్య రూపాలు నేర్చుకున్నట్టుగా కొన్ని కథనాలు ప్రస్తావించాయి). ఫైజీ- రహమిన్‌కి చెందిన త్రీ ఆర్ట్స్ సర్కిల్ లో పని చేసే టర్కిష్ రచయిత, రాజకీయ కార్యకర్త అయిన ఖలీదా అదీబ్ ఖానుమ్ – అన్నా పేరును అజురీ అని మార్చారు. ‘అన్నా’ను కొందరు ‘దేవి’ అని పిలవడం విన్న ఖానుమ్ ముఖం చిట్లించి, “ఆమె పేరు దేవి కాదు, బుతాన్-ఎ-అజూరీ అని ఉండాలి!” అని ప్రకటించారు, ఇది పౌరాణిక శిల్పి అజార్ చెక్కిన దేవతల విగ్రహాల దైవిక అందాన్ని అమీర్ ఖుస్రూ చెప్పడాన్ని సూచిస్తుంది.

చేతివేళ్ళతో తట్టడం, కాలి వేళ్ళతో తట్టడం ద్వారా అజురీ నాట్యంలో కెరీర్‌ను ప్రారంభించారు, ఆమె పుట్టుకతోనే నటి. బాల్యం నుండి ఆమెను ఏదీ ఆపలేకపోయింది, తను తరచుగా అద్దం ముందు రకరకాల భంగిమలు పెట్టడం తండ్రి చూసినా, ఆమె గదిలో ఏకాంతంలో నృత్యం చేసేవారు.

14 ఏళ్ళ వయస్సు వరకు, ‘అన్నా’కు సినిమాల గురించి ఏమీ తెలియదు. ఆమె భారతీయ వంటవాడు, డ్రైవర్ మొదట ఆమె దృష్టిని ‘భారతీయ సినిమాల’ (ఉన్నత వర్గాలలో ధిక్కారంగా ఉపయోగించే పదాలు) వైపు మరల్చారు. బొంబాయిలోని ఇంట్లో, అన్నా కూడా సలోన్‌లో జరిగే వినోదాల్లోనూ, చర్చలలో పాల్గొనేవారు, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో షా అనే ఆంగ్ల రచయిత తన నృత్యాన్ని ఇష్టపడ్డాడని, “ఆ వృద్ధుడికి అన్నింటికంటే నా అవయవసౌష్టవం ఎక్కువగా నచ్చింది” అని హాస్యంగా చెప్పారు. 1933లో బొంబాయికి ప్రయాణిస్తున్నప్పుడు సలోన్‌ను సందర్శించినది జార్జ్ బెర్నార్డ్ షా అని ఆ జర్నలిస్ట్ తరువాత తెలుసుకున్నాడు. సలోన్ “తన సమయాన్ని వృథా చేసింది” అని షా గ్రహించారట.

ఒక సినిమా సెట్‌లో కనిపించి, ‘ఒక సన్నివేశం కోసం ఒక కుండను తీసుకుని నడుముని ఊపమని’ అడిగిన తర్వాత, అజురీ 1935 నుండి 1947 వరకు సినిమాల్లో క్రమం తప్పకుండా నర్తకిగా కనిపించారు. 5 అడుగుల ఎత్తు, సన్నగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉండే ‘అన్నా’ చాలా తక్కువ సమయంలోనే బొంబాయి చిత్ర పరిశ్రమలో భాగమయ్యారు.

చాలా సినిమా పాటల పుస్తకాలలో, అజురీ పాత్ర పేరు లేకుండా, సినిమా సారాంశాలలో ప్రస్తావన లేకుండా ఒక సాధారణ నర్తకిగా పేర్కొన్నారు, కానీ ఆమె తన చిత్రాలలో అద్భుతమైన హైపర్‌విజిబిలిటీని ప్రదర్శిస్తారు. ఆమె నటించిన ఆ కాలపు చాలా చిత్రాలు అందుబాటులో లేనప్పటికీ, ఓ పాటల చిన్న పుస్తకం జర్మన్-ఇండియన్, యూదు-హిందూ అన్నా మేరీ గుయిజెలర్ ఉనికిని – సినిమాల అద్భుతమైన ఊహలో, దాని పాటలలలో, కథాంశంలో, పాత్ర సంభాషణల ఉచ్చారణలో తప్పక కనిస్తుందని స్పష్టంగా తెలియజేస్తుంది.

అజురీ తన అరుదైన పాట-నృత్య సన్నివేశాలలో ఒకటైన ‘చంద్రసేన’ లో (వి. శాంతారామ్, 1935) లో అక్షరాలా నీడలా కనిపిస్తారు. ఆమె డ్రమ్ మీద నృత్యం చేస్తున్న సిల్హౌట్ రూపాన్ని ఈ పాట ప్రదర్శిస్తుంది. ఈ పాటలో కొద్దిసేపు అజూరీ నీడని, కొద్దిసేపు గాయని-నటి రజని ముఖం మీడియం క్లోజప్‌ని చూపిస్తారు, ఆమె గాత్ర ప్రదర్శనను, అజురీ ఇంకా నలుగురు బ్యాకప్ నర్తకీమణులు పాటకు డ్రమ్స్‌పై నృత్యం చేస్తున్న లాంగ్ షాట్‌లు పాటలో కనబడతాయి.

అజురీ భారత ఉపఖండంలోని పలు నృత్యాలను వివిధ గురువుల వద్ద నేర్చుకున్నారు. తరువాత ఆమె బొంబాయి చిత్ర పరిశ్రమలో భాగమయ్యారు. ఆమె మొదటి చిత్రం ‘నాదిరా’. ఆ తర్వాత, ఆమె పరదేశి సయాన్, ఖత్ల్-ఎ-ఆమ్, ది బాంబే టాకీస్, నయా సంసార్ వంటి అనేక చిత్రాలలో నటించారు. అజురీ 700కి పైగా చిత్రాలలో నటించారు, నృత్యాలకు ప్రసిద్ధి చెందారు. అజురీ నృత్యానికి సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి, దాంతో ఆమె ప్రసిద్ధ ఐటెం నంబర్ డాన్సర్ అయ్యారు. ఆమెను బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నృత్య ప్రదర్శన కోసం ఆహ్వానించారు. అజురీ మాయ, సోనార్ సంసార్, లగ్న బంధన్ వంటి బెంగాలీ చిత్రాలలో కూడా నటించారు.

నర్తకిగా అజురీ ఛాయాచిత్ర రూపం ఏకకాలంలో ఆరాధ్య వస్తువుగా, అదృశ్యమైన రూపాన్ని సూచిస్తుంది. తన ప్రఖ్యాత ప్రభాత్ ఫిల్మ్ కంపెనీకి చిహ్నంగా స్త్రీ సిల్హౌట్‌ను ఉపయోగించిన చిత్ర దర్శకుడు వి. శాంతారామ్, “అజురీ లాంటి ఆకారం ఉన్న అమ్మాయిని నాకు ఇవ్వండి, నేను మీకు ఏదైనా ఇస్తాను” అని అన్నట్లు చెప్తారు.

1930-40లలో అజురీకి నర్తకిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ దర్శకులు/నిర్మాతల నుండి చాలా కాంట్రాక్టులు/ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆమె ఎప్పుడూ తన రంగస్థల ప్రదర్శనలను మానలేదు.

ఆమె శరీరం, దుస్తులు, నృత్యం గురించి జర్నలిస్టులు రాసే రాతలకు సమాంతరంగా అజురీ సొంత వార్తాపత్రిక, మ్యాగజైన్ కాలమ్‌లు కూడా ఉన్నాయి, ఆవి బహుళ రంగాలలో తీవ్రమైన ప్రతిఘటనను వ్యక్తపరుస్తాయి. నిజానికి, అజురీని ప్రత్యేకంగా ఆకర్షించేది ఏమిటంటే, 1930లలో, ఆమె నృత్యంపై కాలమ్‌లు రాస్తూ, నాట్యం, సినిమా రంగాలలో మహిళా ప్రజా ప్రదర్శనకారిగా ఉండటం. చురుకుగా ధ్యానం చేస్తూ, తన నృత్యం, రచన, రంగస్థల వృత్తి ద్వారా విభిన్న వ్యక్తిత్వాలను నేర్పుగా ప్రదర్శించారామె.

1935లో ఆమె రాసిన “నృత్యం, ఒక పవిత్ర కళ” అనే వ్యాసంలో, భారతీయులు నృత్యానికి తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఇ. కృష్ణయ్యర్, రుక్మిణీ దేవి అరుండేల్ వంటి సాంస్కృతిక పునరుజ్జీవనకారులను, భారతీయ నృత్యానికి ‘గౌరవం’ కల్పిండానికి ప్రయత్నించిన ఇతరులను ప్రస్తావించారు.

పాకిస్తాన్‌లో నివసించాలని నిర్ణయించుకున్న కొద్దిమంది ముస్లిమేతరులలో ఆమె ఒకరు. 1947 ప్రాంతంలో, ఆమె ఒక ముస్లిం నావికాదళ అధికారిని వివాహం చేసుకుని, విభజన తర్వాత కొంతకాలం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రాష్ట్రమైన పాకిస్తాన్‌లో నృత్యం యొక్క స్థానం గురించి చర్చను ప్రారంభిస్తూ, పట్టణంలోని మౌల్వీల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆమె రావల్పిండిలో మొదటి ‘అకాడమీ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్’ను ప్రారంభించారు. అయితే నిధుల కొరత కారణంగా ఆ పాఠశాల మూతబడింది. ఆమె కొన్ని పాకిస్తానీ చిత్రాలలో నటించడానికి ప్రయత్నించారు కానీ త్వరలోనే వాటిని వదిలివేశారు. ఆ తర్వాత బొంబాయి నుండి వలస వచ్చిన మరో నృత్యకారుడు రఫీ అన్వర్‌తో కలిసి ఆమె 100 మంది నృత్యకారులతో విజయవంతమైన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు కలిసి నృత్య దర్శకత్వం వహించి యుగళగీతాలు ప్రదర్శించారు, విదేశాలలో పర్యటించారు; 1949లో తన శిష్యుడు సూర్య కుమార్‌తో కలిసి ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ లీగ్ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చేసిన నాట్య ప్రదర్శన చాలా ప్రశంసలు పొందింది.

నృత్యం పట్ల అజురీకి ఉన్న అంకితభావం గొప్పది, ఆమె ప్రతి ప్రత్యర్థితో – కార్యనిర్వాహకులతో, అధికారులతో, ప్రభుత్వ అధికారులతో పోరాడింది. ఆమె వారితో వేగంగా, పరిపూర్ణమైన ఆంగ్ల ఉచ్చారణలో మాట్లాడటం వారిని గందరగోళానికి గురిచేస్తుంది, కానీ వారు దానిని ఒక రకమైన అధికారంగా భావించి ఆమెను ఒంటరిగా వదిలేశారు.

1936లో కలకత్తా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత (ఆమె గౌరవనీయులైన దేబకి బోస్, పిసి బారువాతో కలిసి ఒక్కొక్క చిత్రానికి పనిచేశారు), ఆమె ముందుగా చెప్పినట్లుగా, బెంగాలీలో చిత్రపంజిలో ఒక కాలమ్ రాశారు. వివాహిత మహిళ ‘శ్రీమతి’ అనే గౌరవ సూచికను అదనపు గౌరవం కోసం స్వీకరించడం, వ్యాసంతో పాటు ఉన్న సాపేక్షంగా విచిత్రమైన చిత్రాలు, ఇంకా వెస్టర్న్ స్క్రీన్ నర్తకిగా తన సొంత వ్యక్తిత్వాన్ని పరిమితం చేయడాన్ని తిరస్కరించడం ద్వారా అజురీ కొత్త పరిశ్రమ మరియు సాంస్కృతిక సందర్భం గురించిన చర్చలను లేవదీశారు.

“ఈ రోజుల్లో చాలా మంది చిత్ర నిర్మాతలు పాశ్చాత్య నృత్యాలను దిగుమతి చేసుకోవడం ద్వారా నృత్యం విషయంలో రాజీ పడుతున్నారు మరియు చౌకైన థ్రిల్‌లను ఇవ్వడానికి తరచుగా అసభ్యతను చూపిస్తున్నారు. ఇది మన దేశీయ నృత్య రూపాలను అవమానిస్తుంది, నృత్య కళ పట్ల గౌరవాన్ని కోల్పోతుంది” అని ఆమె ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

అజురీ కరాచీలోని పాకిస్తాన్-అమెరికన్ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక సభ్యురాలిగా, ఇస్లామాబాద్‌లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆమెతో, “మీరు నృత్యం చేయడానికి బయటకు వచ్చినప్పుడు మీ సమాధి కూడా ఖాళీగా ఉంటుంది.” అని చెప్పినట్టు అంటారు. 1958లో హిందీ చిత్రం ‘బహానా’ (ఎం కుమార్, 1960)లో నృత్యం చేయడానికి బొంబాయికి  ప్రయాణిస్తున్నప్పుడు కొత్త సరిహద్దుల మధ్య చొచ్చుకుపోయే లక్షణం జనాల దృష్టిని ఆకర్షించింది.

“కథాంశం లేదు, సన్నివేశాలు లేవు, దర్శకత్వం సరిగా లేదు” అని సినిమాలను తిట్టి, నవజాత పాకిస్తాన్ చిత్ర పరిశ్రమ పట్ల నిరాశ చెందిన అజూరీ సినిమాలను వదిలివేసి, తన నృత్య బృందంతో అంతర్జాతీయంగా పర్యటించడం ప్రారంభించారు. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ఆమె పర్యటనలకు మంచి ఆదరణ లభించింది.

1977లో జనరల్ జియా-ఉల్-హక్ మార్షల్ లా విధించిన తర్వాత, ఆర్ట్స్ కౌన్సిల్‌లను రద్దు చేసి, వేదికపై మహిళలు చేసే నృత్యాన్ని ‘అన్-ఇస్లామిక్’ గా నిషేధించిన తర్వాత, అజురీ తన జీవితంలోని చివరి రెండు దశాబ్దాలను ఇంట్లో మరియు రావల్పిండిలోని స్టేషన్ స్కూల్‌లో నృత్యం నేర్పిస్తూ గడిపారు. గౌరవనీయమైన ఓరియంటల్ నృత్యకారిణిగా ఆమె స్వీయ-రూపాన్ని ప్రతిబింబించే అజురీ స్వంత కాలమ్‌లకు, రిస్క్ డ్యాన్సింగ్ గర్ల్ వ్యక్తిత్వాన్ని నిర్మించే ఇతరుల రచనలకు మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంది. 1943లో ఫిల్మ్ ఇండియాలో “Baburao Patel Kicks Indian Dancers About!” అనే శీర్షికతో రాసిన వ్యాసంలో, కోపతాపాలు, అభిప్రాయాలను రూపొందించే ఎడిటర్, సాధనా బోస్‌ను ఆదర్శవంతమైన, సాంకేతికంగా సాధించిన చలనచిత్ర నృత్యకారిణిగా వర్ణించారు: “నా ఆదర్శానికి దగ్గరగా ఉన్న ఏకైక వ్యక్తి సాధనా. సగటు నృత్య ప్రేమికుడిని ఆకట్టుకునేంత సాంకేతికత ఆమెకు తెలుసు, ఆమెకు తగినంత సహజమైన దయ ఉంది, ఆమెకు మధురమైన స్త్రీరూపం, తగిన ఆహ్లాదకరమైన వ్యక్తీకరణ అదనం”.

బొంబాయిలో ఉన్నప్పుడు అజూరీ – స్టేషన్ రోడ్, మాహిమ్ లో ఉండేవారు. తరువాత కాలంలో ఆమె తన దత్తపుత్రుడితో హోటల్ మెట్రోపోల్‌లోని శిథిలావస్థలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసించారు. అప్పుడామె ఫోన్ నంబర్ 80222,

అజురీ ఆగస్టు 1998లో మరణించారు. ఆమెను రావల్పిండిలోని ఒక చర్చి స్మశానవాటికలో, ఒక పాత చెట్టు కింద ఖననం చేశారు. ఆమె అంత్యక్రియలకు 15 మంది హాజరయ్యారు.

Exit mobile version