సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి, నిర్మాత అంజలీ దేవి:
త్వరలోనే ఆమెకు ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్బరాయుడు తన ‘మేనరికం’ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి ఆహ్వానం పంపారు. దీనిని బొంబాయిలో చిత్రీకరించాలని అనుకున్నారు. ఆమె ఆసక్తిగా బొంబాయికి వెళ్ళింది. ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ను ఆమె మొదటిసారి కలిసారు. కానీ సినిమా ఊపందుకోవడం లేదు. రోజులు గడిచేకొద్దీ, ఆమె తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేసింది. ఆమె తన బంగారు గాజులు అమ్మి, డబ్బు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ అనుభవంతో ఆమెకు సినిమాలు అంటే ఇష్టం పోయింది. ఇప్పుడు ఆమె నాట్య ప్రదర్శనలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుని ఒక డ్యాన్స్ ట్రూప్‌ను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వచ్చి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హోల్ మరియు అతని భార్య ముందు నృత్యం చేయమనిఈ ట్రూప్‌కు ఆహ్వానం అందింది. గవర్నర్ ఆమె ప్రదర్శనను ఇష్టపడ్డారు, ఆమెకు మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కలెక్టర్, జిల్లా జడ్జ్ తమ ప్రసంగాలలో ఆమెను ప్రశంసించారు, ఆమెకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించారు.
ఇది ఇలా ఉండగా, ఆది నారాయణరావు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌ను స్థాపించి, అంజలిని తన క్లబ్లో నటించడానికి తిరిగి తీసుకువచ్చారు. ఆమె అంగీకరించి కాకినాడకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆదినారాయణరావు వసంతసేన, నాలుగో పెళ్లి, లోభి, వీధి గాయకులు మొదలైన నాటకాలకు సంగీతం రాసి, స్వరపరిచారు. ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు వారు యుద్ధ నిధి కోసం, రెడ్ క్రాస్ నిధుల కోసం అనేక ప్రదర్శనలు ఇచ్చారు. విశాఖపట్నం వారిని వైజాగ్ క్లబ్లో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించింది. ఆ రోజు అంజలికి బంగారు పతకం లభించింది. ఆమె, ఆదినారాయణరావు బంగారు భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడలేదు. అన్ని నృత్య నాటకాలలో ‘వీధి గాయకులు’ నాటకానికి వారిద్దరూ అపారమైన ప్రశంసలని, ధనాన్ని పొందారు. దీనిని ఆదినారాయణరావు రాశారు, సంగీతం అందించారు, ఇంకా నృత్య దర్శకత్వం వహించారు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌ను అనేక ప్రదేశాలకు ఆహ్వానించారు.
1946లో శోభనాచల సంస్థ ‘గొల్లభామ’ అనే సినిమాను నిర్మిస్తోంది. నటి కృష్ణవేణి కథానాయికగా నటిస్తున్నారు, వారు వ్యాంప్ పాత్రకు కొత్తవారిని కోరుకున్నారు. కృష్ణవేణిగారు చాలా మంది కొత్తవారిని చూశారు, కానీ ఎవరూ ఆమెకి నచ్చలేదు. నటుడు రేలంగి ఆమెకు అంజలి గురించి చెప్పారు. ఆమెను ఆహ్వానించమని కృష్ణవేణి చెప్పారు. కానీ అప్పుడే కొడుకుకు జన్మనిచ్చి తల్లి అయ్యారు. 11 రోజులు గడిచేకొద్దీ చాలా బలహీనంగా ఉండేవారు. ఆమె తిరిగి బలాన్ని పొందడానికి ఆమెను బాగా చూసుకుంటానని, తీసుకురమ్మని రేలంగిని కోరారు కృష్ణవేణి ఆమెకు దానిమ్మ రసాన్ని, ప్రత్యేక ఆహార పదార్థాలను ఇచ్చారు [ఈ చిత్రం యూ ట్యూబ్‌లో ఉంది, అంజలీ దేవి చాలా అందంగా ఉన్నా, బలహీనంగా కనిపించడాన్ని చూడవచ్చు]. 1946 జనవరి 13న భోగి రోజున అంజలి మద్రాస్ సినిమా ప్రపంచంలోకి గొప్పగా అడుగుపెట్టారు. షూటింగ్ ముందుకు సాగుతుండగా, నిర్మాతలు రషెస్ చూసి ఆమె ఇంటికి బారులు తీరారు. ఆమె మదాలస, భూలోక రంభ, బాలరాజు, శివగంగ వంటి చిత్రాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గొల్లభామ విడుదలైనప్పుడే తాను వారి చిత్రాలలో నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఈ చిత్రం హిట్ అయింది. ఆమె ప్రకటనను ఇష్టపడి నిర్మాత మీర్జాపురం జమీందార్ ఆమెకు ఒక ఇల్లు కానుకగా ఇచ్చారు.
ఆమె ‘మాయా రంభ’ సినిమాలో నటిస్తున్నప్పుడు, టి.పి. సుందరం నుండి కమల్ బ్యానర్ సినిమా ‘మహాత్మా ఉదరంగర్’ లో హీరోయిన్ గా నటించమని ఆహ్వానం అందింది. ఆ సినిమా 1947 లో విడుదలైంది. ఆ సినిమా తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొద్ది కాలంలోనే ఆమె తమిళం మాట్లాడటం నేర్చుకున్నారు. ఆ సినిమాలో ఆమె గొంతు నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆమె రెండు క్లాసికల్ డ్యాన్సులు చేశారు.
అప్పటికి తమిళ సినిమా ‘మర్మయోగి’ విడుదలై సూపర్ హిట్ అయింది. అంజలిని ‘ఏక్ థా రాజా’ సినిమాలో నటించమని అడిగినప్పుడు ఆమెకు హిందీ సినిమా రంగంలోకి అవకాశం వచ్చింది. ఆమె మార్చి 1949లో ఈ సినిమాకి సంతకం చేశారు. కానీ ఆమె హిందీ ఉచ్చారణ బాలేల పోవడంతో, ఆమె పాత్రకి డబ్బింగ్ చెప్పించారు.
బొంబాయిలోని చంద్రిక ఫిల్మ్స్ యజమాని అంజలిని ఇష్టపడి, తమ ‘సుఖ్ రంభ’ అనే చిత్రంలో నటించమని పిలిచారు. ఆమె దేవనర్తకి రంభ పాత్రలో నటించారు. తరువాత ఆమెను AVM తమిళ, తెలుగు, హిందీ భాషలలో నటించమని అడిగింది ఆ సినిమాని హిందీలో ‘లడ్కీ’ అని అన్నారు, ఇది ఆమె 3వ హిందీ చిత్రం. ఆమెకు హిందీ చిత్రాలలో నటించడానికి మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇది 1953లో జరిగింది. ఆమె భర్త అంజలి పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించారు. వారు 1953లో ‘పరదేశి’ చిత్రాన్ని నిర్మించారు. ఇది పూర్తిగా పరాజయం పాలైంది. నేర్చుకునే దశాలో ఇదొక అనుభవమని భావించి, అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అంజలి 1948లో ఆదినారాయణరావును వివాహం చేసుకున్నారు. వారు మద్రాసులో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు.
అంజలీ దేవి తన 86వ ఏట 2014 జనవరి 13న చెన్నైలోని విజయ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆమె అవయవాలను రామచంద్ర వైద్య కళాశాలకు దానం చేశారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
