సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
సినీ ప్రముఖులకు సన్మానాలు జరగడం సాధరణమే. అయితే ఓ సినీ ప్రముఖుడికి సినీతారలంతా కలిసి సత్కారం చేయడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన ఘటనలలో ఒకదానిని గురించి ఈ వారం తెలుసుకుందాం.
1958లో దర్శక నిర్మాత శ్రీ బి.ఎన్.రెడ్డి అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇందుకు మొత్తం సినీ పరిశ్రమ సంతోషించింది. బి.ఎన్.రెడ్డి గారిని గౌరవించడం కోసం మద్రాసులోని విజయ గార్డెన్స్ వేడుక జరిపారు, టీ పార్టీ ఏర్పాటు చేశారు (అయితే బి.ఎన్.రెడ్డిగారి ఈ సన్మానం గురించి ఆయన జీవిత చరిత్రలలో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం). అదే ఏడాది రచయిత నార్ల వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యులయ్యారు. ఆయనే ఈ సన్మాన సభకి అధ్యక్షత వహించారు. నటులు నాగయ్య అందరినీ ఆహ్వానించి స్వాగతోపన్యాసం చేశారు. నాగయ్య బి.ఎన్. రెడ్డి గారి ప్రతిభని ప్రశంసించి, చిత్రపరిశ్రమకు ఆయనందించిన సేవలను కొనియాడారు. రెడ్డి గారు కవీ, నటుడు లేదా గాయకుడు కాకపోయినప్పటికీ, ఆయన కృషి వీరందరి కృషి కంటే గొప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపికకి ఆయన అన్ని విధాలు అర్హులని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్.టి.రామారావు సన్మాన పత్రం చదివి, తెలుగు చలన చిత్ర రంగానికి బి.ఎన్.రెడ్డి జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. ఆ తరువాత ఎస్.వి.రంగారావు గారి సన్మాన పత్రాన్ని రెడ్డిగారికి అందజేసి, అందుకు ఆయన పూర్తిగా అర్హులని ప్రకటించారు. బి.ఎన్.రెడ్డి గారికి సావిత్రి తిలకం దిద్దగా, అంజలీదేవి గంధం పూశారు. జి. వరలక్ష్మి పన్నీరు జల్లగా, అక్కినేని కశ్మీరు శాలువా కప్పి సత్కరించారు.
కమ్యూనిస్టు నాయకులు పి.రామ్మూర్తి మాట్లాడుతూ బి.ఎన్.రెడ్డిని అందరూ గౌరవించాలనీ, అదే సమయంలో అటువంటి గొప్పవ్యక్తిని మండలికి నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. తానూ, బి.ఎన్.రెడ్డి విభిన్నమైన వ్యక్తిత్వాలు గలవారమైనప్పటికీ, తాను ఆయన సినిమాలలో నటించనప్పటికీ – ఆయన సాధించిన విజయాల పట్ల తాను ఆయననెంతో గౌరవిస్తానని అక్కినేని చెప్పారు. తమని మర్చిపోవద్దనీ, చిత్ర పరిశ్రమకి సంబంధించిన సమస్యలను మండలి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలని అక్కినేని కోరారు.
తాపీ ధర్మారావు, సముద్రాల, కె. సుబ్రహ్మణ్యం, ఖాసా సుబ్బారాఅవు తదితరులు ప్రసంగించారు.
రాజకీయాలు తనకంతగా గిట్టవని బి.ఎన్.రెడ్డి అన్నారు. విలువలని మరువకుండా ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని, ఉన్నత విలువలని కలిగి ఉండాలని ఆయన అన్నారు. వాహిని స్టూడియో నిర్మాణానికి దోహదం చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణ స్వామిని; ఎ. కె. శేఖర్, రామనాథ్, కె.వి. రెడ్డి, నాగయ్యలను ప్రశంసలలో ముంచెత్తారు. తన విజయాలకు వారే కారణమని అన్నారు. రేలంగి వందన సమర్పణ చేయడంతో సభ ముగిసింది. తర్వాత అందరూ టీపార్టీకి హాజరయ్యారు.
కొందరు బాల నటులు పెరిగి పెద్దవారైనప్పటికీ, వారి చిన్ననాటి రూపం ప్రేక్షకుల మనసులో నిండిపోతుంది. వాళ్ళని తలచుకోగానే ఆ చిన్నారి రూపమే గుర్తొస్తుంది. అలాంటి బాలనటులలో ఒకరు మాస్టర్ బాబు.
మాస్టర్ బాబు పూర్తి పేరు మునీంద్ర బాబు. సుప్రసిద్ధ తమిళ స్టంట్ మాస్టర్ బలరామ్ గారి అబ్బాయి. బలరామ్ తెలుగు, తమిళ సినిమాలకు పని చేశారు. ఆయన భార్య తెలుగావిడ. మాస్టర్ బాబు 12 సెప్టెంబరు 1956 నాడు జన్మించారు. బాబుకి ఆరు నెలల వయసులోనే ఆయన తండ్రి మరణించారు. మాస్టర్ బాబుకి మరో స్టంట్ మాస్టర్ వి.సి. స్వామి బాబాయి అవుతారు. ఆయనే ఈ పిల్లవాడిని బాల నటుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. ఆయన మొదటి సినిమా తమిళంలో ‘కళ్యాణ పారిసు’. దర్శకులు శ్రీధర్. ఆయన ఈ సినిమాతో మాస్టర్ బాబుని వెండి తెరకి పరిచయం చేశారు. ‘పెళ్ళి కానుక’ సినిమాలో కూడా ఆయన అదే వేషం వేశారు. ఎన్.టి.రామారావు బాబుని బాగా అభిమానించి ఎన్నో చిత్రాలలో అవకాశాలు ఇప్పించారట. బొబ్బిలి యుద్ధం, అమరశిల్పి జక్కన్న, సత్య హరిశ్చంద్ర, అన్నపూర్ణ వంటివి ఆయన నటించిన కొన్ని సినిమాలు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సరిగ్గా వ్రాద్దామా?-4
‘సిరికోన’ చర్చాకదంబం-13
తరలిపోయిన పాటల వసంతం
నా జీవన గమనంలో…!-24
ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-12
సంచిక ఉగాది కవితల పోటీ 2022 ఫలితాలు – కవుల పరిచయాలు
పదసంచిక-44
సాఫల్యం-23
మట్టి
అడవిలో వెన్నెల
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®