Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 259

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటుడు మదన్ పూరి:

మదన్ పూరి ప్రధానంగా హిందీ, పంజాబీ చిత్రాలలో నటించారు. అమ్రిష్ పూరి, చమన్ పూరి – ఆయన సోదరులు. మదన్ పూరి ప్రధానంగా సహాయ నటుడిగా, ప్రతినాయక పాత్రలలో (విలన్) కనిపించారు. యాభై సంవత్సరాల కెరీర్‌లో ఆయన దాదాపు 430 చిత్రాలలో నటించారు.

మదన్ పూరి 30 సెప్టెంబర్ 1915 నాడు అవిభక్త భారతదేశంలోని నవాన్‌షహర్‌లోని రహోన్‌లో (ప్రస్తుతం పంజాబ్‌లో ఉంది)లో జన్మించారు. ఆయన రహోన్‌లో చదువుకున్నారు. ఆయన ఐదుగురు పిల్లలలో రెండవవాడు. అన్నయ్య చమన్ లాల్ పూరి. అమ్రిష్ పూరి, హరీష్ లాల్ పూరి తమ్ముళ్ళు, చంద్రకాంత మెహ్రా చెల్లి. దిగ్గజ గాయకుడు నటుడు కె. ఎల్. సైగల్ ఆయనకి దగ్గరి బంధువు.

మదన్ పూరి తన తొలి చిత్రం ‘ఖజాంచి’ (1941) లో జానకిదాస్, రామోలా దేవి, మనోరమతో కలిసి “సావన్ కే నజారే హైఁ..” అనే పాటలో కో-సైక్లిస్ట్ పాత్రలో నటించారు.

1960 దశకం చివరలో, 1970ల ప్రారంభంలో మదన్ పూరి – భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులలో ఒకరు. తన సమీప బంధువు, గాయకుడు కె.ఎల్. సైగల్ సహాయంతో మదన్ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. ఒకసారి ఆయన స్థిరపడి స్టార్ అయిన తర్వాత, తన సోదరుడు అమ్రిష్ పూరికి కూడా సాయం చేసి ఆయన సినీరంగంలో స్థిరపడటానికి కారణమయ్యారు.

మదన్ పూరి 1940ల నుండి 1980ల మధ్యకాలం వరకు దాదాపు 50 సంవత్సరాల పాటు నట జీవితం గడిపారు. 1946లో ఆయన ‘అహింస’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. మదన్ సంవత్సరానికి సగటున ఎనిమిది సినిమాలు చేశాడు, విలన్‌ పాత్రలు, ఇతర నెగటివ్ పాత్రలు పోషించారు. హీరో లేదా హీరోయిన్ మామగా, తండ్రిగా, అన్నయ్యగా, తాతగా, పోలీసు అధికారిగా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలలో౦ నటించారు. ఆయన తన కెరీర్ మొత్తంలో ‘జట్టి, జట్ పంజాబీ’ వంటి అనేక పంజాబీ చిత్రాలలో నటించారు.

తాను పోషించే పాత్రలకి పేరు తెచ్చే విశిష్ట నటులలో మదన్ పూరి ఒకరు. మర్యాదగల గ్యాంగ్‌ల్యాండ్ బాస్‌గా లేదా దొంగగా, తరువాత జీవితంలో, దయగల ముసలి మామగా లేదా తాతగా, మదన్ పూరి అతిపెద్ద సూపర్‌స్టార్‌తో వెండితెరను పంచుకుంటూ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నారు. అనవసరంగా అందరి దృష్టి తనపై పడేలా కాకుండా, సన్నివేశపు అవసారలని బట్టి ఆయన నటనలో సమర్ధవంతంగా లీనమవుతారు, ఇది ఆయన్ని గొప్ప నటుడిని చేసింది. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం మంచి నటుడి లక్షణం – మదన్ పూరి అందులో చాలా నిష్ణాతులు. తాను పోషించే ఏ పాత్రనైనా అప్రయత్నంగానే స్వీకరించారు. అందుకే, దశాబ్దాలుగా ‘విలన్’గా ఉన్న మదన్ పూరి, ‘దుల్హన్ వోహి జో పియా మాన్‌జాయే’లో దయాళువైన తాత అయ్యారు.

మదన్ పూరి 69 సంవత్సరాల వయసులో, 13 జనవరి 1985 నాడు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత, ఆయన నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి, 1989లో ఆయన విడుదలైన ‘సంతోష్’ సినిమాలో ఆయన చివరిగా సారిగా కనిపించారు.

ఆయన ముంబైలోని మాతుంగాలోని ఆర్‌పి మసాని రోడ్ నివాసి. దీనిని పంజాబీ గల్లీ అని కూడా పిలుస్తారు, ఆ కాలంలోని ఇతర నటులతో పాటు కపూర్‌లు కూడా ఉన్నారు.

***

మదన్ పూరి నటించిన సినిమాల పాక్షిక జాబితా:

***

మదన్ పూరి భార్య షీలా దేవి పూరి (వాధేరా) కొన్ని సంవత్సరాల తర్వాత మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ప్రవేశ్ పూరి, లెఫ్టినెంట్ కల్నల్ (డాక్టర్) కమలేష్ కె. పూరి,  రమేష్ పూరి. కమలేష్ తన తండ్రి మదన్ పూరి జీవితం, సినిమాల గురించి ‘మై ఫాదర్ – ది విలన్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

Exit mobile version