Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలగని వెలుగు

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అలగని వెలుగు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

వెలుగు అలగదు
అవలకు తొలగదు
ఎన్నటికీ మలిగిపోదు
ఎప్పటికీ చెదిరిపోదు
కనులు మూసుకున్నా
కాంతి పుంజాలు ఆగునా
మనసుని తాకి మరీ
రాగ రంజితం చేయదా
అనురాగ మందిరం చేయదా
స్వచ్ఛమైన ప్రేమకు
మారు రూపే వెలుగు
ఆ దివ్యత్వం ముందు
ఏదైనా దిగదుడుపు

Exit mobile version