[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘అక్షర సమరం చేయాలి’ అనే గేయం పాఠకులకు అందిస్తున్నాము.]
అమ్మ నాన్నల్లాగా
ప్రేమ పంచుకుంటూ
ఆటపాటలతోటి చదువు నేర్పుతుంటే
విద్యార్థి మనసుకు ఉల్లాసం కలిగిస్తే
బడిని విడిచి ఉండలేరూ వాళ్ళు
చదువస్సలే మరిచిపోరు
వందనాలు గురువులరా మీకు వందనాలు
అందుకోండయ్యా
అందుకోలేనిది ఏమున్నదయ్యా
అందుకునేందుకు
ఆదుకోండయ్యా //అమ్మ నాన్న//
బడి ఈడు పిల్లలు
బడి బయటే ఉన్నారు బాల కార్మికులుగా
బలి అవుతున్నారు
బాధ్యత తెలిసి
మనమంత కలసి
భావి పౌరులను కాపాడుకుందాం //అమ్మ నాన్న//
అందరమొకటై కదలాలి
అక్షర సమరం చేయాలి
అందరికీ విద్యా అందాలి
అది అందరి బాధ్యత కావాలి
మన అందరి
బాధ్యత కావాలి
మన అందరి
బాధ్యత కావాలి
మన అందరి
బాధ్యత కావాలి
అక్షరం ప్రభాకర్‌గా ప్రసిద్ధులైన వీరి అసలు పేరు నాగెల్లి ప్రభాకర్. లక్ష్మమ్మ, హనుమంతులు తల్లిదండ్రులు. ఒకప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా (మరియు మండలం) లోని అమనగల్ గ్రామంలో 6 జూలై 1976 నాడు జన్మించారు. వృత్తి: తెలుగు భాషోపాధ్యాయులు. వీరి ప్రవృత్తి: పుస్తక పఠనం, ప్రకృతి పర్యావరణం పరిరక్షణ సామాజిక గేయాలు, బాలల గేయాలు రచన. ప్రభాకర్ గారి జీవిత భాగస్వామి పేరు రోజా బాయి. కుమారులు త్రిలోక్, త్రివర్ణ్.
ప్రభాకర్ గారి ప్రచురించిన రచనలు:
1. ఆ పది జిల్లాలు ఆపద జిల్లాలు (దీర్ఘ కవిత సంపుటి), 2. కన్నీళ్ల పంటలు (దీర్ఘ కవిత సంపుటి), 3. అక్షరం సాక్షిగా.. (కవితా సంపుటి) 4. అక్షరాభ్యాసం (తెలుగువాచకం) 5. అక్షరామృతం (గేయరూప కవిత్వం, తెలుగు హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలలో ప్రచురితం), 6.అక్షరామృత్ (గేయ రూప కవిత్వం, హిందీ), 7. అక్షరామృతం (సాంగ్ ఫార్మేట్ పోయెమ్స్, ఇంగ్లీష్), 8. అక్షర తపస్వి, 9. అక్షర భారతం (వ్యాస సంపుటి), 10. అక్షర కోకిల (పర్యావరణ పరిరక్షణ సామాజిక చైతన్య గీతాలు), 11. అక్షర స్వరం (గేయ రూప కవిత్వం).
~
రాబోయే పుస్తకాలు
12. అక్షర జీవనది, 13. అక్షరాభిషేకం, 14. అక్షరామృతం (3, 4, 5 వాల్యూమ్స్), 15. అక్షర లక్షణ సారం (సులభ వ్యాకరణం) 16. అక్షర మొలకలు (పదవిన్యాసాలు), 17. అక్షరాంజలి, 18. అక్షర వీక్షణం,19 అక్షర యానం
