[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘అజ్ఞాత ప్రేమికుడు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీకు తెలియని నేను
నిన్ను ఎంత కావాలి అనుకుంటానంటే
కడవరకు నీతోనే ఉండేంత
నీకు తెలియని నేను
నీ గురించి ఎంత ఆలోచిస్తానంటే
నన్ను నేనే మర్చిపోయేంత
నీకు తెలియని నేను
నిన్ను ఎంత ప్రేమిస్తానంటే
మీ అమ్మ కూడా అసూయ పడేంత
నీకు తెలియని నేను
నిన్ను ఎంత ఆరాధిస్తానంటే
ఆ దేవుడు కూడా ఈర్ష పడేంత
నాలాంటి దేవదాసుడు ఆయనకి దాసుడుగా లేడే అని
నా ప్రియమైన నీకు ఈ అజ్ఞాత ప్రేమికుడు
రాసిన ప్రేమ ఉత్తరం..
అజ్ఞాత ప్రేమికుడు..