Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అదెంత

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అదెంత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దెంత పని
చేయాలనే శ్రద్ధ ఉంటే చాలు
కష్టమెంతైన చేయవచ్చు

అదెంత లెక్క
నడిచే సత్తువ ఉంటే చాలు
దూరమెంతైన నడవవచ్చు

అదెంత శ్రమ
మోయాలనే ఆసక్తి ఉంటే చాలు
భారమెంతైన మోయవచ్చు

అదెంత ఆట
గెలవాలనే తపన ఉంటే చాలు
చాకచక్యమెంతైన చూపవచ్చు

అదెంత కీర్తి
ఉదారతావాదం ఉంటే చాలు
ఉన్నదంత ఊడ్చి పెట్టవచ్చు

Exit mobile version