Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్దం ఆవల

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అద్దం ఆవల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వ్వు నాదే నాతోనే కదా ఉండాలి
కాంతి పరావర్తనం
ముందు నిలిచిన అందాలనన్నీ
అద్దంలో చిత్రించే

నేనూ
ఒక చెట్టులా అక్కడ
ఊగే ఊయల గాలిలో

ఆ వెలుగు నవ్వు వెన్నెల కల
దాటి వెళ్ళింది అటుగా
శూన్యం బింబప్రతిబింబం లేదు
నేను కూడా మరి

అద్దం ఆవల
అంతా పొరలుపొరలుగా విచ్చిన
చీకటి నా మనసులోనే కాదు
ఈ ప్రపంచమంతా పరుచుకుంది

ఇంతలో
బాబూ అనే అమ్మ పిలుపుతీపి

వేయి గెలాక్సీలు కాంతి
నా రెటినాపై
క్విక్ మోషన్ డీప్ ఎమోషన్ ముద్ర

అమ్మంటే తెలిసింది
చీకటికీ బాధకూ విరుగుడని
సుఖసంతోషాల పొత్తిళ్ళ అమ్మే నా బతుకు ప్రొటోప్లాజమని

Exit mobile version