Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2025 కై విమర్శా గ్రంథాలకు ఆహ్వానం – ప్రకటన

రసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2025 సంవత్సరంకు గాను సాహిత్య విమర్శకు ప్రదానం చేయుటకు నిర్ణయించడమైనది. కావున సాహిత్య విమర్శా గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం.

నిబంధనలు:

  1. 2021 జూలై నుండి 2025 జూన్ వరకు ప్రచురించినవై ఉండాలి.
  2. మెుదటి ముద్రణలు మాత్రమే పంపాలి.
  3. నాలుగు ప్రతులు పంపాలి.
  4. అన్ని ప్రాంతాల వారు పంపవచ్చును.
  5. వివిధ రచయితల కూర్పు సంకలనాలు పంపరాదు.
  6. ప్రతులు చేరవలసిన చివరి తేది 31 ఆగస్టు 2025.
  7. ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2025లో హనుమకొండలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో రూ॥5000/- నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం చేయనగును.

పుస్తకాలు పంపవలసిన చిరునామా
బూర భిక్షపతి
ఇంటి నెంబర్, 2 -12-293/20
రోడ్ నెంబర్ 2B
విజయనగర్ కాలని, గోపాలపురం రోడ్
హనమకొండ 506009 (తెలంగాణ)
ఫోన్: 9866612712

రచయితలు సకాలంలో వారి విమర్శా గ్రంథాలను పంపవలసినదిగా అరసం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బూర భిక్షపతి, ప్రధాన కార్యదర్శి మార్క శంకరనారాయణ గారలు ఒక ప్రకటనలో కోరారు.

Exit mobile version