Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అభినందన సేవా సంస్థ 2025 హాస్య కథల పోటీకి కథలకు ఆహ్వానం

విజయనగరం పట్టణానికి చెందిన అభినందన సేవా సంస్థ 2025 సంవత్సరానికి హాస్య కథల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి రచయితల నుంచి కథలను ఆహ్వానిస్తోంది.

కథలు రెండు పేజీలకు మించరాదు. చేతిరాతతో కానీ, టైపు చేసినవైనా కానీ పోస్టు ద్వారానే పంపాల్సి ఉంటుంది. కథ ఇంతకు ముందు ఎక్కడా ప్రచురితం కాలేదని, ఎందులోనూ పరిశీలనలో లేదని తెలియజేస్తూ రచయిత హామీ పత్రాన్ని విధిగా కథతో జత చేయాలి. కథలు పంపడానికి చివరి తేదీ: 1 మార్చ్ 2025.

పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా రూ. 2,500/-, రూ. 2,000/-, రూ. 1.500/- నగదు బహుమతులు అందజేయబడతాయి.

మరో మూడు కథలకు రూ. 500/- వంతున కన్సొలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు.

కధలు పంపాల్సిన చిరునామా:

డాక్టర్ సి. రామలక్ష్మి,

60-12-6, జీ-3,

బ్యాంక్ కాలనీ-2,

మొగల్రాజపురం,

విజయవాడ-520010.

ఫోన్: 63027 38678

రచయితలు ఉత్సాహంగా పాల్గొని, పోటీని విజయవంతం చేయగలరు.

వేలమూరి నాగేశ్వరరావు

కార్యదర్శి.

Exit mobile version