Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆత్మ అవినాశి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మ అవినాశి’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 2వ అధ్యాయం (సాంఖ్య యోగం) 17వ శ్లోకం

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం। 
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి॥

శరీరమంతటా వ్యాపించిన ఆత్మ నాశనము లేనిదని, అటువంటి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడూ సమర్థుడు కాడు అని భగవానుడు అర్జునుడికి ఆత్మ యొన్న అవినాశి తత్వాన్ని చక్కగా బోధిస్తున్నాడు.

శరీరమంతటా వ్యాపించిన ఆత్మ యొక్క నిజతత్వాన్ని ఈ శ్లోకం మరింత స్పష్తంగా వివరిస్తోంది. ఈ సృష్టిలో అణువణువునా వ్యాపించి వున్న ప్రాణవాయువు వలే దేహమంతటా కూడా చైతన్యం వ్యాపించి వుంది. శరీరం యొక్క, మనస్సు యొక్క, బుద్ధి యొక్క ప్రతీ చర్య ఈ చైతన్యమనే శక్తి ద్వారానే సాధ్యపడుతోంది. కాని ఈ చైతన్యం మానవుని దేహం వరకు మాత్రమే పరిమితమై వుంది. కనుకనే ఒక దేహం చేసే చర్యలు, అనుభవించే క్లేశాలు మరొక దేహానికి తెలియవు. అయితే అన్ని శరీరాలలో వుందే చైతన్యానికి ఆధారభూతం జీవాత్మ అని వేదం ప్రవచిస్తోంది. ఇటువంటి జీవాత్మ అవినాశి మరియు శాశ్వతం అని పై శ్లోకం భావం.

ఆత్మ – అవినాశి, నిత్యమైనది, అనంతమైనది, అవ్యయమైనది, అక్షరమైనది. దానిని శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహించలేను, నీళ్లు ముంచలేవు, గాలిచోటుచేసి ఎగరగొట్టలేను. ఇది శాశ్వతమూ, తత్త్వమూ, తటస్థమైనది. ఈ శాశ్వత ఆత్మనే నేను – అలాగే ఇతరులందరమూ. అందరి జన్మలకు ఆధారభూతము, అందరి హృదయాలలో కులువుండే ఆత్మను నశింపజేయడం ఎవరివల్లా కూడా కాదు.

ఆ నిత్య ఆత్మనే నేను, ఈ భౌతిక శరీరములో త్రిగుణములతో కూడిన ప్రకృతినుండి ఉద్భవించిన మనస్సు, శరీరం, ఇంద్రియములతో కూడిన మాయాస్వరూప జీవాత్మగా అనుభవిస్తున్నారు. జీర్ణించిపోయే ఈ శరీరరూపంలో ఉన్నా, నేను నశించను. శరీరం క్షయం చెందుతుంది, కానీ నేను – ఆత్మగా – శాశ్వతంగా ఉన్నాను అని భగవానుడు ఆత్మ అవినాశి తత్వం గురించి చెబుతున్నారు.

శరీరం చనిపోతుంది కానీ ఆత్మ మాత్రం మరణించదు. ఇది నిత్యం, అనాది, అవ్యయం. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దేహంలోకి ప్రవేశిస్తుంది. దీనిని పునర్జన్మ అంటారు. శరీరానికి మూలం ఆత్మ కానీ ఆత్మకు మూలం శరీరం కాదు. శరీరం కేవలం ఆత్మ యొక్క తాత్కాలిక, భౌతిక రూపం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరొక శ్లోకంలో “నీవూ, నేనూ, ఈ రాజులందరూ ఎప్పుడూ ఉన్నవారమే; భవిష్యత్తులోనూ ఉంటాము.” అని అన్నాడు అంటే ఆత్మ రూపంలో ఇంతకు ముందు వున్నాము, ఇక ముందు కూడా వుంటాము అని అర్థం. ఈ ప్రకారం మన అసలైన స్వరూపం శరీరం కాదు – అది శాశ్వతమైన ఆత్మ. శరీర మార్పు సత్యం అయినా, ఆత్మ మారదు. ఆత్మ అవినాశి.. శరీరం సవినాశి.

Exit mobile version