[ప్రముఖ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ రచించిన ‘Hope is the thing with feathers!’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of American poet Emily Dickinson’s poem ‘Hope is the thing with feathers!’ by Mrs. Geetanjali.]
~
ఆశ అనేదొక రెక్కలున్న విషయం !
ఆత్మలో స్థిరంగా కూర్చుంటుంది.. కదలకుండా!
ఎప్పటికీ ఆపకుండా
పదాలు లేని పాటను అలా అనంతంగా పాడుతూనే ఉంటుంది.
గాలిలో కూడా తియ్యగా వినిపిస్తుంది.
చలితో ముడుచుకు పోయే చాలా పక్షులకి ఎండకాచినట్లున్న ఆశ..
తుఫానులో కూడా ఒక మంట లా ఎగుస్తూ
చిన్న పక్షి కూడా సిగ్గు పడేలా చేస్తుంది.
నేను ఈ ఆశని రాయిలా గడ్డ కట్టుకు పోయే మంచు దేశాల్లో చూసాను!
ఒక అపరిచిత సముద్రపు ఆకాశంలో చూసాను.
అయినా కూడా ఒక్కసారైనా అది నా లోపలి..
ఒక్క భాగాన్ని కూడా బదులుగా అడగలేదు.
అదీ ఆశ అంటే!
~
మూలం: ఎమిలీ డికిన్సన్
అనువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964