[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘ఆమె’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె నవ్వులకు
ఏ కాలమైనా
తొలకరి చినుకులు
నేల రాలాల్సిందే
ఆమె చూపులకు
రేయి
వెండి వెన్నెల
చాప పరచాల్సిందే
ఆమె పలుకులకు
వేసవి అయినా
చల్లని మంచు
కురిపించాల్సిందే
ఆమె రూపానికి
ఎవరైనా
దాసోహం అంటూ
బందీ కావాల్సిందే
